Site icon NTV Telugu

Extramarital Affair: వివాహేతర సంబంధం.. భర్తను హతమార్చిన భార్య..

Extramarital Affair

Extramarital Affair

Extramarital Affair: వివాహేతర సంబంధాలు హత్యలు, ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. భార్యభర్తల బంధాన్ని ఈ తరహా సంబంధాలు విచ్ఛిన్నం చేస్తున్నాయి. తాజాగా రాజస్థాన్‌లో వివాహేతర సంబంధం హత్యకు దారి తీసింది. 35 ఏళ్ల భర్తను భార్య హత్య చేసింది. ఈ కేసులో నిందితురాలైన మహిళను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. బుండీ జిల్లాలోని డబ్లానా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున రాజేంద్ర గుర్జార్(35) తన ఇంట్లో రక్తపుమడుగులో మరణించి కనిపించాడు. అతనిని శరీరంపై పదునైన ఆయుధాలతో దాడి చేసిన గుర్తులు కనిపించాయి.

Read Also: Nayanthara-Vignesh Shivan: పదేళ్ల నయనతార.. రెండేళ్ల విక్కీ-నయన్!

అయితే, మృతుడి భార్య మమత(32) ఈ హత్యను దొంగలు చేసినట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. బంగారు చెవి రింగులతో తీసేసి, ఇంట్లోని వస్తువులను చెల్లాచెదురుగా పడేసి హత్యను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించినట్లు పోలీస్ అధికారి మనోజ్ సికర్వాల్ తెలిపారు. తొలుత పోలీసులు గుర్తుతెలియన వ్యక్తులపై హత్యానేరం నమోదు చేశారు. భార్య కదలికపై అనుమానం రావడంతో ఆమెను విచారించగా నిజం భయటపెట్టింది. విచారణలో నిందితురాలైన మమతకి సమీప గ్రామానికి చెందిన వ్యక్తితో సంబంధం ఉన్నట్లు తేలింది. ఈ విషయంపై భార్యభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవని తేలింది. దీంతోనే మమత తన భర్తను అడ్డుతొలగించేందుకు హత్య చేసినట్లు తేలింది.

Exit mobile version