Site icon NTV Telugu

Bengaluru: బెంగళూరులో దారుణం.. మహిళపై గ్యాంగ్ రేప్ చేసి దోపిడీ

Bengaluru

Bengaluru

టెక్ సిటీ బెంగళూరులో దారుణం జరిగింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన మహిళ(27)పై ఐదుగురు సభ్యులతో కూడిన బృందం సామూహిక అత్యాచారానికి పాల్పడింది. అనంతరం ఇంట్లో విలువైన వస్తువులను దోచుకెళ్లారు. నిందితులు.. మహిళను బెదిరించి సామూహిక అత్యాచారం చేయడమే కాకుండా ఇంట్లో నుంచి రెండు మొబైల్ ఫోన్లు, రూ.25,000 నగదు ఎత్తుకెళ్లారు. ప్రాణాలతో బయటపడిన పెద్ద కొడుకు తెల్లవారుజామున 12:30 గంటలకు ఎమర్జెన్సీ కాల్ చేయడంతో పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

ఇది కూడా చదవండి: Delhi Encounter: ఢిల్లీలో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు గ్యాంగ్‌స్టర్లు హతం

బెంగళూరు రూరల్‌లోని గంగొండనహళ్లిలోని ఒక ఇంట్లో పశ్చిమ బెంగాల్‌కు చెందిన మహిళ నివాసం ఉంటుంది. ఇద్దరు మహిళలు, ఇద్దరు పెద్దలు, ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటుంది. ఐదుగురు సభ్యులతో కూడిన బృందం తలుపు తెరవమని అడిగి లోపలికి చొరబడ్డారు. అనంతరం బెదిరించి మహిళపై ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. మంగళవారం రాత్రి 9:15 గంటల నుంచి అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. పెద్ద కొడుకు తప్పించుకుని పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. నిందితులు కూడా స్థానిక నివాసితులుగా పోలీసులు గుర్తించారు.

ఇది కూడా చదవండి: Tuni Minor Rape: తుని అత్యాచారం కేసు.. చెరువులోకి దూకిన నిందితుడు..

ఐదుగురు నిందితుల్లో ముగ్గురు కార్తీక్, గ్లెన్, సుయోగ్‌గా గుర్తించారు. పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలిస్తున్నారు. నిందితులు.. బాధిత కుటుంబానికి పరిచయం ఉన్నవారేనా? లేదంటే గ్యాంగ్‌ పనా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మిగతా నిందితుల కోసం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) పర్యవేక్షణలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. నిందితులపై సామూహిక అత్యాచారం, దోపిడీ కేసు నమోదు చేశారు.

ఇది కూడా చదవండి: Shriya Saran : శ్రియ పిచ్చెక్కించే అందాలు.. చూస్తే అంతే

Exit mobile version