Site icon NTV Telugu

Ujjain: ప్రాణం తీసిన ‘‘దుపట్టా’’.. మిషన్‌లో ఇరుక్కుని మహిళ మృతి..

Ujjain

Ujjain

Ujjain: విషాదకర సంఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఆమె ధరించిన దుపట్టానే మెడకు ఉరితాడులా బిగుసుకుపోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలోని ఫుడ్ సెంటర్‌లో చోటు చేసుకుంది. బంగాళాదుంపల తొక్క తీసే యంత్రంలో దుపట్టా చిక్కుకుపోయింది. దీంతో మెడకు బిగుసుకుపోవడంతో 30 ఏళ్ల మహిళ శనివారం మరణించినట్లు అధికారులు తెలిపారు.

Read Also: Tata Sierra EV: టాటా లవర్స్‌కి గుడ్‌న్యూస్.. కొత్త ఈవీ కార్ వచ్చేస్తోంది.. ఫీచర్స్ అదుర్స్!

ఆలయంలోని అన్నక్షేత్రంలో ఉదయం ఈ ప్రమాదం జరిగింది. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డిఎం) లక్ష్మీ నారాయణ్ గార్గ్ విలేకరులకు తెలిపారు. బాధితురాలిని రజనీ ఖత్రీగా గుర్తించారు. ఆ సమయంలో ఆమె వంటగదిలో పనిచేస్తోందని, ఆమె దుపట్టా మిషన్‌లో చిక్కుకుందని ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీస్ ఉద్యోగులు చెప్పారు. బాధితురాలని సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా, ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకి తరలించారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందని అధికారులు తెలిపారు. అన్నక్షేత్రం మహాకాళేశ్వర ఆలయం నుంచి దాదాపుగా 500 మీటర్ల దూరంలో ఉంటుంది. భక్తులకు అన్నదానం చేస్తుంటారు.

Exit mobile version