NTV Telugu Site icon

MP: ఓ ప్రైవేటు ప్రకటనలో మహిళా కానిస్టేబుల్ ప్రత్యక్షం.. అధికారుల యాక్షన్

Womanconstable

Womanconstable

మధ్యప్రదేశ్‌లో ఓ మహిళా కానిస్టేబుల్‌ అత్యుత్సాహం ఉద్యోగానికి ఎసరు పెట్టింది. ఓ కోచింగ్ సెంటర్‌ను ప్రమోట్ చేస్తూ ప్రకటన చేసింది. ఇందుకు సంబంధించిన ప్రకటన పబ్లిక్‌లోకి రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఆమె చర్యను తప్పుపడుతూ సస్పెండ్ చేశారు.

ఇది కూడా చదవండి: Bhale Unnade: పెళ్ళికి ముందే వేసి చూసుకునే రూల్ పెట్టాలట… రాజ్ తరుణ్ ఈసారి గట్టిగా కొట్టేట్టున్నాడే!

పోలీస్ డిపార్ట్‌మెంట్ పరీక్షల కోసం ఆయా కోచింగ్ సెంటర్లలో తర్ఫీదు జరుగుతూ ఉంటుంది. అయితే యూనిఫాంలో ఉన్న ఒక మహిళా కానిస్టేబుల్‌తో నేరుగా రత్లామ్ జిల్లా ఇండోర్‌లోని ఇన్‌స్టిట్యూట్ వాళ్లు ఓ ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెపై అధికారులు శుక్రవారం సస్పెన్షన్ వేటు వేశారు. అలాగే ఆమెపై శాఖాపరమైన విచారణ కూడా ప్రారంభించింది. పోలీసు డిపార్ట్‌మెంట్ పరీక్షల కోసం అభ్యర్థులకు శిక్షణ ఇచ్చే ఇన్‌స్టిట్యూట్‌ను కానిస్టేబుల్ ప్రమోట్ చేయడాన్ని తప్పుపట్టింది. రత్లాం పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) రాహుల్ లోధా చర్యలు తీసుకున్నారు.

ఇది కూడా చదవండి: Divvela Madhuri: దువ్వాడ శ్రీనివాస్‌ను హత్య చేయడానికి ప్రయత్నించింది వాణినే.. మాధురి కౌంటర్

వీడియోలో ఓ యువతి ట్రాఫిక్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ దగ్గరకు వచ్చి.. ‘హలో మేడమ్.. నేను మీలాగే ఉండాలనుకుంటున్నాను.. మీరు ఎక్కడి నుంచి పోలీసు ఉద్యోగం కోసం ప్రిపేర్ అయ్యారు?’ అని అడుగుతుంది. ఇండోర్‌లోని ఒక కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ గురించి గొప్పగా కానిస్టేబుల్ వివరించి చెబుతుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు తప్పుపట్టారు. మహిళా కానిస్టేబుల్.. కోచింగ్ సెంటర్‌ను ఎలా ప్రమోట్ చేస్తుందని ప్రశ్నించారు. దీంతో అధికారులు మహిళా కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు.