NTV Telugu Site icon

Akhilesh Yadav: మోడీ సర్కార్ ఎక్కువ కాలం ఉండదు, త్వరలో పడిపోతుంది..

Akhilesh Yadav

Akhilesh Yadav

Akhilesh Yadav: బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో ఈ రోజు ‘ ధర్మతల ర్యాలీ’ని నిర్వహించారు. కోల్‌కతాలో జరిగిన ఈ ర్యాలీలో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. మతం పేరిట దేశాన్ని విభజించేందుకు కుట్రలు పన్నుతున్న శక్తులు తాత్కిలికంగా విజయం సాధించవచ్చు కానీ, అంతిమంగా ఓడిపోతాయని అన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రజలు బీజేపీని ఓడించారని అన్నారు.

అధికారంలోకి వచ్చిన వారు చుట్టం చూపుగానే ఉంటారని, కేంద్రంలోని ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని, త్వరలోనే పడిపోతుందని జోక్యం చెప్పారు. బెంగాల్ ప్రజలు బీజేపీతో పోరాడారని, ఉత్తర్ ప్రదేశ్‌లో కూడా ఇదే జరిగిందని చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వంలో కూర్చున్న వ్యక్తులు కొద్ది రోజులు మాత్రమే అధికారంలో ఉంటారని, వారిడి నడిచే సర్కార్ కాదని, పడిపోయే సర్కార్ అని ఆయన చెప్పారు.

Read Also: Tummala Nageswara Rao: అన్ని శాఖల అధికారులకు మంత్రి తుమ్మల క్లాస్..

ఉత్తర్ ప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ కనబరిచిన ఫలితాలను సీఎం మమతా బెనర్జీ ప్రశంసించారు. యూపీలో మీరు ఆడిన ఆట బీజేపీ ప్రభుత్వాన్ని బలవంతంగా రాజీనామా చేయాల్సి ఉంది, కానీ సిగ్గులేని ప్రభుత్వం కేంద్ర ఏజెన్సీలను, ఇతర మార్గాలను దుర్వినియోగం చేస్తూ అధికారంలో కొనసాగుతోందని మండిపడ్డారు. ర్యాలీకి హాజరైన అఖిలేష్ యాదవ్‌కు మమతా బెనర్జీ కృతజ్ఞతలు తెలిపారు.

కేంద్రంపై అఖిలేష్ చేసిన వ్యాఖ్యలకు మమతా మద్దతు ఇచ్చారు. కేంద్రంలోని ప్రభుత్వం బెదిరింపుల ద్వారా ఏర్పడిందని, అది ఎక్కువ కాలం నిలవదని అన్నారు. బీజేపీకి ప్రజలు గుణపాఠం చెప్పారని టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ అన్నారు. 400 సీట్లు దాటుతామని చెప్పినప్పటికీ 240కే వారు పరిమితమయ్యారని బీజేపీని ఎద్దేవా చేశారు. టీఎంసీకి వ్యతిరేకంగా ఈడీ, సీబీఐని ప్రయోగించినా విజయం సాధించలేకపోయారని అన్నారు. సందేశ్ ఖాలీ నాటకంతో బెంగాల్ పరువు తీయాలని చూశారని మండిపడ్డారు.