కశ్మీర్‌కు తాలిబన్లు…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరుడు గట్టిన తాలిబన్ల తీరు మారుతుందా? ఇకనైనా పద్దతి మార్చుకుంటారా? మాటకు కట్టుబడి ఉంటారా! అలా జరుగుతుందంటే ఎవరైనా నమ్ముతారా? చస్తే నమ్మరు. తాలిబన్ల ట్రాక్ రికార్డ్ అటువంటిది మరి. అందుకే ఆఫ్గనిస్తాన్ పొరుగు దేశాల్లో గుబులు మొదలైంది. ఒక్క పాకిస్తాన్‌కు మాత్రమే ఆ భయం లేదు. తాలిబాన్ అనే పాముకు పాలు పోసి పెంచింది అదే కదా! తాలిబన్ల విజయం చూసి పాకిస్తాన్ పండగ చేసుకుంటోంది. కానీ .. ఏదో ఒక రోజు దానిని కూడా మింగడానికి వెనకాడరు తాలిబాన్లు. పాపం పిచ్చి పాకిస్తాన్‌కి ఆ విషయం అర్థం కావట్లేదు. ఈ విషయం పక్కన పెడదాం.
కశ్మీర్‌పై తాలిబాన్లను పాక్ ప్రయోగిస్తుందన్నది లేటెస్ట్ టాక్. కశ్మీర్ లోయలో ఇటీవల తలెత్తిన పరిణామాలు.. ప్రజలలో నెలకొని వున్న ఆగ్రహావేశాలను తనకు అనుకూలంగా మార్చుకోవాలని పాకిస్తాన్ బావిస్తోంది. తాలిబన్లపై తనకున్న పట్టు నుంచి పాక్ లబ్ధిపొందాలని ఆశిస్తోంది. అమెరికా లేని ఆఫ్గనిస్తాన్‌లో పాక్ పాలకులు ఆడింది ఆట పాడిందే పాటగా మారుతుందని విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు.
Also Read
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
కశ్మీరీ ప్రజలు ఇప్పుడు తమను ఎవరో బందించి వేశారన్న భావనలో ఉన్నారు. భారత ప్రభుత్వం తమను తీవ్ర అణచివేతకు గురిచేస్తోందన్న కోపంతో ఉన్నాడు సగటు కశ్మీరీ. అందుకే కాబూల్ ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారన్న వార్త టీవీల్లో వస్తున్నప్పుడు కాశ్మీరీల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. ఆనందంతో సంబరాలు జరుపుకున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తమపై అణచివేత పెరిగిందని..దీని నుంచి కాపాడేందుకు తాలిబన్ యోధులు వస్తారని కశ్మీరీలు ఆశిస్తున్నారని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రోజులు గడుస్తున్నాయి ..కానీ భారత ప్రభుత్వం కశ్మీరీలలో తిరిగి విశ్వాసాన్ని నెలకొల్ప లేకపోతోందన్న విమర్శలు ఉన్నాయి. ఈ పరాయీకరణను కశ్మీరీలు అనేక రకాలుగా వ్యక్తం చేస్తున్నారు.తాలిబాన్ల విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవటమే అందుకు నిదర్శనం. పొరుగు దేశాలతో భారత్‌కు ప్రతికూల అనుభవాలు ఎదురైన ప్రతిసారి కశ్మీర్ లోయ ప్రజలు సంతోషాన్ని వ్యక్తంచేస్తారు..తామే గెలిచిన అనుభూతి పొందుతారు.
కశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు తరువాత అక్కడి ప్రజల్లో తీవ్ర నిరసనలు పెల్లుబికాయి. కేంద్రం తీసుకున్న పాలనాపరమైన చర్యల పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ మార్పులు కశ్మీరీలలో ఆగ్రహం పెల్లుబికేలా చేశాయి. ప్రజాస్వామ్య ప్రక్రియపై ఆశలను కోల్పోయి .. మిలిటెన్సీ వైపు మరింత మొగ్గు చూపుతున్నారని సిటిజన్స్ రిపోర్ట్ అంటోంది.
ఆఫ్ఘనిస్తాన్‌తో పాటు అంతర్జాతీయ జిహాదీలు కశ్మీర్‌లోకి ఎంటరవుతారా ? పునరావాసం పొందే అవకాశం వుందా. అంటే ..ఉందనే అంటోంది యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ అకాడమీలోని రీసెర్చ్ సెంటర్ మోడరన్ వార్ ఇనిస్టిట్యూట్ (MWI) లో సహోద్యోగి అయిన యెలీనా బిబెర్మాన్. అయితే ఈ అంచానలు సత్యదూరమని హోం మంత్రిత్వ శాఖ కొట్టిపారేస్తోంది. ఆఫ్గన్ పరిణామాల పట్ల కాశ్మీర్‌తో పాటు దేశంలోని మిగిలిన ప్రాంతాలలో కొంత ఆనందం వ్యక్తమైంది. కానీ దాని వల్ల ఇప్పటికిప్పుడు వచ్చే ముప్పేమీ లేదని హోమంత్రిత్వ శాఖ వర్గాలు అంటున్నాయి. కశ్మీర్‌లో విదేశీ ఉగ్రవాదుల్లో ఎవరూ వాస్తవానికి ఆఫ్ఘనిస్తాన్ వారు కాదు. ఎక్కువగా పాకిస్తాన్, పీఓకే నుంచి వచ్చిన వారేనని వారు గుర్తు చేస్తున్నారు.
ఇకపై కశ్మీర్‌పై పాక్ పావులు కదపటం తీవ్రం చేస్తుందని విదేశాంగ నిపుణులు అంటున్నారు. కశ్మీర్ సమస్య పరిష్కారానికి తాలిబన్లు సహాయం తీసుకుంటామని పాకిస్తాన్ ప్రకటించటం పరిస్థితికి అద్దంపడుతోంది. భవిష్యత్‌లో ఏం జరగనుందో ఊహించవచ్చు. పాక్ అధికార పార్టీ నేత నీలం ఇర్షాద్ షేక్ ఓ టీవీ డిబేట్ లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పడవి దుమారం రేపుతున్నాయి. అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఇరుకున పెట్టే అవకాశం వుంది. తాలిబన్లతో పాకిస్తాన్ కుమ్మక్కైందనేది నిజమని దాంతో తేలిపోయింది.
కశ్మీర్ అంశంపై పాకిస్తాన్‌తో చేతులు కలుపుతామని తాలిబన్లు ప్రకటించారంటూ నీలం ఇర్షాద్ పాకిస్తాన్‌లోని ఓ ప్రైవేట్ టీవీ ఛానెల్ చర్చ సందర్భంగా అన్నారు. దీంతో టీవీ షో యాంకర్ అప్రమత్తమై.. ‘‘మేడం.. బాగా ఆలోచించే ఈ వ్యాఖ్యలు చేశారా? భారత్ సహా ప్రపంచమంతటా ఈ షోను చూస్తారు’’ అని గుర్తు చేసింది. ఐనా ఇర్షద్ మాట మార్చలేదు. తాలిబన్లు తమకు సాయం చేయనున్నట్లు స్పష్టం చేశారు. కశ్మీర్ విషయంలో తాము జోక్యం చేసుకోబోమని తాలిబన్లు గతంలో ప్రకటించిన సంగతి గమనార్హం. నీలం ఇర్షాద్ వ్యాఖ్యలను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. చూడాలి ముందు ముందు ఈ వ్యాఖ్యలు ఎక్కడికి దారితీస్తాయో!!
- Tags
- Afghanistan
- india
- Kashmir
- Taliban
తాజావార్తలు
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
-
Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ దర్శకుడు!
-
Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
-
Rahul Gandhi: ‘ప్రభుత్వాన్ని తొలగించండి’ అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
-
Story Board : దేశ ప్రజల స్వరం మారుతోంది..కేంద్రంపై అసంతృప్తి ,ఆవేశం మరింత రాజుకుంటే…
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!