Site icon NTV Telugu

Rekha Gupta: ఆ భవనాన్ని మ్యూజియంగా మారుస్తాం..

Rekha

Rekha

Rekha Gupta: అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ఢిల్లీలో శీష్ మహల్ పేరు బాగా వినిపించింది. ఇప్పుడు ఆ భవనాన్ని మ్యూజియంగా మారుస్తామని ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రి రేఖా గుప్తా తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలన్నీ త్వరలోనే నెరవేరుస్తాం.. అలాగే, ఈ పదవికి నన్ను ఎంపిక చేసినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వెల్లడించింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా పని చేసినప్పుడు సివిల్‌ లైన్స్‌లో 6 ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్ బంగ్లాను అధికారిక నివాసంగా ఉపయోగించేవారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి 7 స్టార్ రిసార్టుగా మార్చుకున్నారని బీజేపీ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించింది. 4 కోట్ల మందికి ఇళ్లు కట్టించామని.. తానేమీ అద్దాల మేడ కట్టుకోలేదని ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ ను నరేంద్ర మోడీ విమర్శించారు.

Read Also: Shivangi : అనిల్ రావిపూడి చేతుల మీదుగా ‘శివంగి’ ఫస్ట్ లుక్ రిలీజ్

అయితే, ఇంటి దగ్గర నుంచి బయటకు వచ్చేటప్పుడు ముఖ్యమంత్రిని అవుతానని నాకు తెలియదు అని రేఖా గుప్తా ప్రకటించారు. 48 మంది ఎమ్మెల్యేల్లో ఒకరిగా బీజేపీ శాసనసభాపక్ష సమావేశానికి వెళ్లా.. కానీ పర్వేష్ సాహెబ్ సింగ్ వర్మ నా పేరు ప్రతిపాదించిన తర్వాతే తెలిసిందని ఆమె చెప్పారు. మార్చి 8వ నాటికి ఢిల్లీలోని మహిళలకు నెలకు రూ.2500 అందజేస్తామని వెల్లడించింది.

Read Also: Trump vs INDIA: భారత్‌లో టెస్లా ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే అమెరికా నష్టపోతుంది..

అయితే, ఆమ్ ఆద్మీ పార్టీ మోసాలకు ఆ శీష్ మహల్ ఓ ఉదాహరణ అనే ప్రచారాన్ని బీజేపీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. ఆప్ సర్కార్ పై వచ్చిన ఈ అవినీతి ఆరోపణలు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని తీవ్రంగా దెబ్బతిసి.. బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టింది. ఇక, మరోసారి విమర్శలకు తావులేకుండా ఆ బంగ్లాకు దూరంగా ఉండాలని కమలం పార్టీ యోచిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఢిల్లీకి కొత్తగా వచ్చే ముఖ్యమంత్రి అందులో ఉండకపోవచ్చని ప్రచారం జరిగింది. వాటికి తగ్గట్టే రేఖా గుప్తా పై విధంగా స్పందించింది. ఇదిలాఉంటే.. ఈరోజు రామ్‌లీలా మైదానంలో ప్రజల సమక్షంలో రేఖా గుప్తా ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, అమిత్‌ షాతో పాటు ఎన్డీయే పక్ష సీఎంలు, ఎంపీలు హాజరుకానున్నారు.

Exit mobile version