NTV Telugu Site icon

India-Canada Conflict: కెనడా ప్రధానిలో మొదలైన భయం.. భారత్-కెనడాల మధ్య వాణిజ్య బంధం దెబ్బతింటుందా..?

India Canada Diplomatic Ties

India Canada Diplomatic Ties

India-Canada Conflict: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పాపులారిటీ అక్కడ రోజురోజుకు పడిపోతోంది. మరోవైపు ప్రభుత్వంపై కొందరు ఎంపీలు అసమ్మతి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటిన్నింటి పక్కకు తప్పించి, మరోసారి సిక్కులు, సిక్కు ఎంపీల మద్దతు పొందేందుకు ఖలిస్తానీ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యని ముందుకు తీసుకువచ్చారు. ఈ కేసులో కెనడాలోని భారత అగ్రశ్రేణి దౌత్యవేత్తల ప్రమేయం ఉన్నట్లు ఆరోపించడంతో ఒక్కసారిగా ఇరు దేశాల మధ్య దౌత్యయుద్ధం మొదలైంది. భారత్ ఇప్పటికే కెనడాలోని భారత హైకమిషనర్‌తో సహా ఆరుగురు దౌత్యవేత్తలను ఉపసంహరించుకుంది. ఇక భారత్‌లో ఉన్న ఆరుగురు కెనడా దౌత్యవేత్తల్ని శనివారంలోగా దేశం వదిలి వెళ్లాలని కేంద్రం విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదేశించింది.

అయితే, ఈ పరిణామాలు ఒకింత కెనడాని ఆశ్చర్యానికి గురిచేసినట్లు తెలుస్తోంది. భారత్ ఇలాంటి కఠిన చర్యలు తీసుకుంటుందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఊహించలేదని అక్కడి మీడియా పేర్కొంటోంది. సిక్కు ఓటర్ల మద్దతు పొందాలని ఈ ఎత్తుగడ వేశాడని తెలిసినా.. భారత్ ఇలాంటి చర్యలు తీసుకుంటుందని కెనడా ఊహించలేదని తెలుస్తోంది.

అయితే, ఈ పరిణామాలు దౌత్యయుద్ధం నుంచి వాణిజ్య యుద్ధంగా మారుతుందా..? అనే కలవరం కెనడా పీఎం ట్రూడోలో మొదలైంది. ఇరు దేశాల మధ్య పరిణామాల కారణంగా ఆయన టెన్షన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థిక సంవత్సరం -2023లో ఇరు దేశాల మధ్య 8.3 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది. ఇందులో కెనడా నుంచి భారత దిగుమతులు 4.6 బిలియన్లు కాగా, మన దేశం నుంచి కెనడాకు ఎగుమతులు 3.8 బిలియన్ డాలర్లు ఉన్నాయి. అయితే, ఈ వాణిజ్య సంబంధాలు దెబ్బతింటే భారత్‌కి పోయేదేం లేదు. వేరే దేశం నుంచి దిగుమతి చేసుకునే అవకాశం ఉంటుంది. 140 కోట్ల జనాభా ఉన్న భారత్ వంటి మార్కెట్‌ని కోల్పోవడానికి ఏ దేశం కూడా ఇష్టపడదు.

Read Also: Health: జలుబు, దగ్గు, గొంతునొప్పితో ఇబ్బంది పడుతున్నారా.. ఈ ఒక్క దానితో సెట్..!

మరోవైపు, , కెనడియన్ పెన్షన్ ఫండ్స్, అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థలు భారతదేశ ఆర్థిక వ్యవస్థలోని కీలక రంగాలలో పెట్టుబడులు పెట్టాయి. పెట్టుబడిదారులు ఈ పరిణామాలను ఆసక్తిగా చూస్తున్నారు. కెనడా భారతదేశానికి రెమిటెన్స్‌లలో అగ్రస్థానంలో ఉంది. కెనడా 2020-21 నుండి 2022-23 మధ్య మొత్తం 3.31 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో భారతదేశంలో 18వ అతిపెద్ద విదేశీ పెట్టుబడిదారుగా ఉంది. కెనడా పెట్టుబడుతు భారత ఎఫ్‌డీఐలలో 0.5 శాతం వాటా కలిగి ఉన్నాయి. మరోవైపు టీసీఎస్, ఆదిత్య బిర్లా గ్రూప్, విప్రో, ఇన్ఫోసిస్ వంటి భారతీయ కంపెనీలు కెనడాలో కీలకంగా ఉన్నాయి.

కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డ్ (CPPIB), కోటక్ మహీంద్రా బ్యాంక్, పేటీఎం, జొమాటోతో సహా అన్ని రంగాలలో భారతీయ సంస్థలలో గణనీయమైన వాటాలను కలిగి ఉంది. 2023 నాటికి, భారతదేశంలో CPPIB పెట్టుబడులు 14.8 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. కెనడా నుంచి భారత్‌కి వస్తున్న చెల్లింపు గురించి చర్చిస్తే.. 2023లో భారత్‌కి ప్రపంచవ్యాప్తంగా 125 బిలియన్ డాలర్ల రిమిటెన్స్ వచ్చాయి. కెనడాలోని భారతీయులు భారత్‌కి డబ్బుల్ని పంపుతూ.. స్థిరమైన చెల్లింపుల ప్రవాహాన్ని సృష్టిస్తున్నారు. ఈ పరిణామాలు వీటిపై ఎక్కడ ప్రభావం పడుతుందో అనే భయం కెనడాలో మొదలైనట్లు తెలుస్తోంది. అయితే, ఈ దౌత్యయుద్ధం, వాణిజ్య సంబంధాలపై తక్కువ ప్రభావాన్నే చూపించే అవకాశం ఉందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు.