Pakistan: “మాది సింధు నాగరికత”.. నీటి కోసం పాకిస్తాన్ కొత్త వాదన..
- సింధూ నాగరికతను ప్రచారం చేస్తున్న పాకిస్తాన్..
- తామే నిజమైన వారసులం అంటూ వింత వాదన..
- సింధు జలాలపై హక్కులు పొందే ఉద్దేశమేనా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పహల్గామ్ ఉగ్రవాద దాడికి పాల్పడిన తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇన్నాళ్లు సింధూ, దాని ఉపనదుల నీటిని వాడుకుంటూ వస్తున్న పాకిస్తాన్‌కు ‘‘సింధూ నది జలాల ఒప్పందం’’ను నిలిపేయడం ద్వారా భారత్ షాక్ ఇచ్చింది. అయితే, ఇప్పుడు నీటి కోసం పాకిస్తాన్ కొత్త పథకాన్ని వేస్తోంది. తన ప్రాచీన చరిత్రను బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఇన్నాళ్లు ఇస్లామిక్ చరిత్రను తమ జాతీయ గుర్తింపుగా మార్చుకున్న పాకిస్తాన్, ఇప్పుడు ‘‘సింధు లోయ నాగరికత’’ను ముందుకు తీసుకువస్తోంది. మొహెంజోదారో, హరప్పా, తక్షశిల, గాంధార వంటి ప్రాచీన వారసత్వ కేంద్రాలను ప్రచారం చేస్తోంది. క్రీ.శ. 712లో ముహమ్మద్ బిన్ ఖాసిం జరిపిన సింధ్ విజయంతోనే తమ చరిత్ర మొదలైందని ఏళ్ల తరబడి విద్యార్థులకు బోధించిన పాకిస్థాన్, ఇప్పుడు సింధు లోయ నాగరికతను ముందుకు తెస్తోంది.
ఇటీవల, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నాయకుడు బిలావల్ భుట్టో జర్దారీ మాట్లాడుతూ.. సింధూ నదిపై పాకిస్తాన్‌కు చారిత్రక హక్కు ఉందని ప్రకటించారు. మొహెంజోదారో, హరప్పా వంటి సింధూ నాగరికత కేంద్రాలు పాక్‌లో ఉన్నందున, ఆ నాగరికతనకు తామే నిజమైన వారసులమని చెప్పాడు. ఇటీవల కాలంలో పాకిస్తాన్ ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా సింధూ నాగరికత ప్రాంతాలకు చాలా ప్రాముఖ్యత ఇస్తోంది. మొహెంజోదారోలో కొత్త తవ్వకాలను చేపట్టింది. తక్షశిల, గాంధార, మెహర్గఢ్ వంటి ప్రాచీన ప్రదేశాలను అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేస్తోంది. భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ను ప్రారంభించి సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన కొన్ని నెలలకే, అంటే జూన్ 2025లో ఈ 5,000 ఏళ్ల నాటి నగరంలో తవ్వకాలు మొదలయ్యాయి.
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
పాక్ చేస్తున్న వాదనల్ని భారత చరిత్రకారులు తిప్పికొడుతున్నారు. పాక్ చేస్తున్న వాదనలు సరికావని అంటున్నారు. సింధు నాగరికతకు చెందిన అనేక ప్రాంతాలు భారత్‌లో కూడా ఉన్నాయని, ముఖ్యంగా ఘగ్గర్-హక్రా నది పరివాహక ప్రాంతంలో విస్తృతంగా అవశేషాలు లభించాయని చెబుతున్నారు. అందుకే “ఇండస్ వ్యాలీ సివిలైజేషన్” కంటే “ఇండస్-సరస్వతి నాగరికత” అనే పదాన్ని ఉపయోగించాలని భారతీయ నిపుణులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!