Site icon NTV Telugu

CM Siddaramaiah: కర్ణాటకపై కేంద్రంలో ఉన్న బీజేపీకి ప్రేమ లేదు..

Siddaramaiah

Siddaramaiah

CM Siddaramaiah: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ అససరాల పట్ల ఉదాసీనతగా వ్యవహరిస్తున్నారని శుక్రవారం మండిపడ్డారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కర్ణాటక ఆకాంక్షలను, అవసరాలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన సహకారం అందించినప్పటికీ.. కేంద్రం రాష్ట్రానికి నిధులను ఇవ్వడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: PM Modi: “కాంగ్రెస్ ఓ పాత ఫోన్”.. 2014లో వదిలేశారని ప్రధాని సెటైర్లు..

కర్ణాటక గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉదానీనతను ఎదుర్కొంటోంది. కీలకమైన నదీ జలాల సమస్యను కేంద్ర పరిష్కరించలేదని, ప్రకృతి వైపరీత్యాల సమయంలో కేంద్రం సహాయం చేయకపోవడం ఆందోళన కలిగిస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. బీజేపీ ఎంపీలు కర్ణాటక హక్కులు, ఆకాంక్షల కోసం కేంద్ర నాయకత్వాన్ని ప్రశ్నించాలని సిద్ధరామయ్య సూచించారు.

ఎన్నికల సమయంలో బీజేపీ నేతలు బెదిరింపులకు గురిచేస్తున్నారని, ఇప్పుడు దాని ఫలితమే మనం చూస్తున్నామని, కరువు సాయంపై బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు ఎందుకు మౌనంగా ఉన్నారని, కన్నడ ప్రజలపై ద్వేషమా..? అని ప్రశ్నించారు. ప్రధాని మోడీ 9.5 ఏళ్ల పాలనలో కర్ణాటకపై ప్రేమ ఎందుకు లేదు..? అని ప్రశ్నించారు. మోడీకి సమాధంన ఇవ్వండి అనే హ్యాష్ ట్యాగుతో ప్రచారానికి సీఎం సిద్ధరామయ్య పిలుపునిచ్చారు. దీంట్లో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని అన్నారు.

Exit mobile version