NTV Telugu Site icon

Mamata Banerjee: వక్ఫ్ బిల్లు పేరిట ముస్లింలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..?

Mamata

Mamata

Mamata Banerjee: వక్ఫ్(సవరణ) బిల్లుపై పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ సోమవారం స్పందించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై మడిపడ్డారు. ముస్లింలను లక్ష్యంగా చేసుకుని పార్లమెంట్‌ ముందుకు బిల్లు తీసుకురావడం అనుమానాలకు కారణమవుతుందని ఆరోపించారు. బిల్లును వ్యతిరేకిస్తూ బెంగాల్ అసెంబ్లీలో ఈ రోజు తీర్మానంపై చర్చ జరిగిన సందర్భంలో మమత మాట్లాడారు. ఈ బిల్లు విషయంలో కేంద్రం రాష్ట్రాలను పట్టించుకోవడం లేదని అన్నారు. వక్ఫ్ బిల్లు విషయంలో కేంద్రం తమని సంప్రదించలేదని చెప్పారు.

Read Also: PM Modi: పార్లమెంట్‌లో ‘ది సబర్మతి రిపోర్ట్‌’ మూవీ చూసిన మోడీ

ఈ బిల్లు విషయమై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) చర్చల్లో బీజేపీ ప్రతిపక్ష సభ్యుల నోరు మూయించిందని టీఎంసీ చీఫ్ ఆరోపించారు. జేపీసీలో ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, వారు అందకే బహిష్కరించాలని మమతా బెనర్జీ అన్నారు. ముస్లింలను ఒంటరిగా చేయడం ద్వారా కేంద్రం విభజన ఎజెండాను ముందుకు తెస్తోందని ఆమె ఆరోపించారు.

‘‘”ఈ వక్ఫ్ (సవరణ) బిల్లు పేరుతో ఒకే మతాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ముస్లింలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? వివిధ హిందూ దేవాలయాల ట్రస్ట్‌లు లేదా చర్చిల ఆస్తులతో మీరు అదే పని చేయడానికి ధైర్యం చేస్తారా? సమాధానం లేదు. కానీ, నిర్దిష్ట సమాజాన్ని లక్ష్యంగా చేసుకోవడం మీ విభజన ఎజెండాకు నిదర్శనం’’ అని మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి మూడింట రెండొంతుల మెజారిటీ లేనందున ఈ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదించగలరా..? అని ప్రశ్నించారు. బంగ్లాదేశ్‌లో పరిస్థితిపై, పొరుగు దేశంలోని హిందువులను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు.