Su-57E Stealth Fighter: భారత్‌కు రష్యా Su-57E ఎందుకు అవసరం.? చైనా, పాక్‌కు చెక్..
- భారత్‌కు Su-57E యుద్ధ విమానాలు అవసరం..
- ఇప్పటికే చైనా వద్ద 5వ తరం యుద్ధ విమానాలు..
- పాకిస్తాన్ చైనా నుంచి కొనుగోలు చేయాలనే ప్లాన్..
- ఈ నేపథ్యంలో రష్యన్ యుద్ధ విమానంపై భారత్ కన్ను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Su-57E Stealth Fighter: చైనా, పాకిస్తాన్ సైన్యాలు తమ 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్లను పెంచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ వైమానిక దళానికి కూడా స్టెల్త్ ఫైటర్ జెట్లు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రష్యా తన Su-57E యుద్ధ విమానాన్ని భారత్‌కు ఆఫర్ చేస్తోంది. ఈ ఫైటర్ జెట్ భారత సైన్యంలో చేరితే చైనా, పాకిస్తాన్లకు చెక్ పెట్టినట్లు అవుతుంది. రష్యా తన ఫైటర్ జెట్‌ను భారత్‌కు అమ్మాలని చూస్తోంది.
భారత్‌కు విక్రయించడంతో పాటు సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, భారత్‌లో సంయుక్త ఉత్పత్తి, సోర్స్ కోడ్ యాక్సెస్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. స్వదేశీ అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) అందుబాటులోకి వచ్చే వరకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు Su-57 యుద్ధ విమానాలు చాలా కీలకం. బ్రిక్స్ సదస్సు కోసం న్యూఢిల్లీ వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ప్రధాని నరేంద్రమోడీ మధ్య శుక్రవారం ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో Su-57 అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది.
Also Read
- BRICS: భారత్‌కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
- Mayawati: బీఎస్పీ వారసత్వంలో మాయావతి ఊహించని ట్విస్ట్.. అన్న కొడుకులకు నో ఛాన్స్! మేనకోడలికి రెడ్ కార్పెట్..
- BRICS 2026: మోదీ చేతుల్లో జిన్‌పింగ్, పుతిన్.. బ్రిక్స్ ఫోటోతో ప్రపంచం షేక్..
- PM Modi - Netanyahu: బ్రిక్స్ వేళ, ఇజ్రాయిల్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు..
భారత్‌కు రష్యన్ ఫైటర్ జెట్ ఎందకు అవసరం??
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు 42 స్వ్కాడ్రన్ల విమానాలు అవసరం. అయితే, ప్రస్తుతం 29 ఫైటర్ స్వ్కాడ్రన్లు మాత్రమే ఉన్నాయి. పాత విమానాలు ఇప్పటికే వైమానిక దళం నుంచి వైదొలుగుతుున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త విమానాల చేరిక చాలా అవసరం. ఇదే సమయంలో చైనా పెద్ద సంఖ్యలో జే-20 స్టెల్త్ ఫైటర్ జెట్లను సమకూర్చుకుంటోంది. మరోవైపు పాకిస్తాన్ కూడా చైనా నుంచి జే-35ఏ ఫైటర్ జెట్లను పొందేందుకు ప్రయత్నిస్తోంది. రెండు వైపులా సరిహద్దు దేశాల్లో 5వ తరం ఫైటర్ జెట్లు ఉంటే భారత్‌కు ప్రమాదం ఉంటుంది.
భారత్ వద్ద ప్రస్తుతం 4, 4.5వ తరంగా చెప్పబడుతున్న యుద్ద విమానాలు మాత్రమే ఉన్నాయి. స్టెల్త్ ఫైటర్ జెట్లు రాడార్లకు చిక్కకుండా దాడులు చేసే సామర్థ్యాలను కలిగి ఉంటాయి. దీని వల్ల యుద్ధంలో ఈ జెట్లు ఉన్న దేశాలు పైచేయి సాధించే అవకాశం ఉంటుంది. ఈ పవర్ బ్యాలెన్స్‌ను సరిచేయాలంటే భారత్‌కు వెంటనే 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్లు అవసరం. భారత్ వద్ద ప్రస్తుతం రఫెల్, సు-30ఎంకేఐ, తేజస్ వంటి ఫైటర్ జెట్లు ఉన్నప్పటికీ, 5వ తరం ఫైటర్ జెట్లతో పోలిస్తే వీటి సామర్థ్యాలు తక్కువ.
Su-57E ఫైటర్ జెట్ ప్రత్యేకత ఏమిటి?
ప్రస్తుతం ప్రపంచంలో మూడు దేశాల వద్ద మాత్రమే 5వ తరం ఫైటర్ జెట్లు ఉన్నాయి. అమెరికా వద్ద ఎఫ్-35 రాఫ్టర్, ఎఫ్ 35 లైటనింగ్2, రష్యా వద్ద Su-57E, చైనా వద్ద జే-20, జే-35 ఉన్నాయి. మిగత వాటితో పోలిస్తే రష్యన్ ఫైటర్ జెట్ స్టెల్త్ సామర్థ్యాలు, విన్యాసాలు చేసే సామర్థ్యం, థ్రస్ట్ వెక్టరింగ్, అధునాతన సెన్సార్ ఫ్యూజన్ వంటి ఫీచర్లు ఉన్నట్లుగా రస్యా చెబుతోంది. గగనతలం నుంచి భూమిపై ఉన్న లక్ష్యాలపై దాడులు చేయగల మల్టీరోల్ ఫైటర్‌గా దీనిని ఉపయోగించవచ్చు.
దీని వల్ల రష్యన్ ఫైటర్ జెట్‌ను భారత సైన్యంలోకి తీసుకోవడం వల్ల చైనా, పాకిస్తాన్ నుంచి పెరుగుతున్న స్టెల్త్ సామర్థ్యాలకు వ్యూహాత్మకంగా సమాధానం ఇవ్వొచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. భారత్‌కు ఇప్పుడు 2-4 స్వ్కాడ్రన్ల 5వ తరం ఫైటర్ జెట్లు అవసరం. ఒక్కో స్వ్కాడ్రన్‌లో 18-20 విమానాలు ఉంటే, మొత్తం 36-80 యుద్ధ విమానాలు అవసరం అవుతాయి.
కొన్ని వివరాల ప్రకారం.. తొలిదశలో భారత్ 36-60 సు-57ఈ ఫైటర్ జెట్లను తీసుకుని, ఆ తర్వాత మిగిలిన వాటిని భారత్‌లో మూడు నుంచి 5 స్వ్కాడ్రన్లు సంయుక్తంగా తయారు చేయాలని భావిస్తోంది. ఒక వేళ రష్యా ఈ టెక్నాలజీని భారత్‌కు బదిలీ చేస్తే.. స్టెల్త్ కోటింగ్, ఏవియానిక్స్, ఇంజన్లు, ఆయుధాల అనుసంధానం వంటి రంగాల్లో భారత్‌కు లాభం చేకూరుతుంది.
తాజావార్తలు
-
Su-57E Stealth Fighter: భారత్‌కు రష్యా Su-57E ఎందుకు అవసరం.? చైనా, పాక్‌కు చెక్..
-
Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
-
BRICS: భారత్‌కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
-
Ponguleti Srinivas Reddy : భూభారతి వెనుక అసలు కథ ఇదే.. సభలో మంత్రి సంచలన ఆరోపణలు
-
Mayawati: బీఎస్పీ వారసత్వంలో మాయావతి ఊహించని ట్విస్ట్.. అన్న కొడుకులకు నో ఛాన్స్! మేనకోడలికి రెడ్ కార్పెట్..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!