NTV Telugu Site icon

Pakistan: పాకిస్తాన్‌కి నిద్రలేని రాత్రులు.. ట్రంప్ క్యాబినెట్‌తో భయం భయం..

Pakistan

Pakistan

Pakistan: అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైనప్పటి నుంచి పాకిస్తాన్‌కి అసలు నిద్ర పట్టడం లేదు. తమ పరిస్థితి ఇలా ఐపోయిందని తెగ బాధపడుతోంది. ట్రంప్ క్యాబినెట్‌లోని తీసుకున్న వ్యక్తులను చూస్తే ఆ దేశం తెగ భయపడిపోతోంది. ప్రతీ రోజు పాక్ మీడియాలో ట్రంప్ క్యాబినెట్, ఇండియా పరపతి పెరిగిపోతుందని అక్కడి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చర్చిస్తున్నారు. ట్రంప్ మంత్రి వర్గంలో విదేశాంగ మంత్రి మార్కో రుబియో, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్(ఎన్ఎస్ఏ) మైక్ వాల్ట్జ్, నేషనల్ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా తులసీ గబ్బార్డ్, సీఐఏ చీఫ్ జాన్ రాక్లిఫ్‌గా నియమించడాన్ని పాకిస్తాన్ తట్టుకోలేకపోతోంది.

విదేశాంగ మంత్రి మార్కో రూబియో:

తదుపరి యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్‌గా మార్కో రూబియోని నియమించడంపై పాకిస్తాన్ ఆందోళన చెందుతోంది. పాక్, చైనాలకు పరమ వ్యతిరేకి ఈయనకు పేరుంది. అదే సమయంలో భారత్‌కి రూబియో అత్యంత సన్నిహితుడు. పాక్ అంటే వ్యతిరేకించడంతో పాటు పెరుగుతున్న చైనా ప్రభావాన్ని అడ్డుకోవాలంటే భారత్‌తో విస్తృత సహకారాన్ని పెంపొందించుకోవాలని పలు సందర్భాల్లో కోరారు. ఈయన ‘‘యూఎస్-ఇండియా డిఫెన్స్ కోఆపరేషన్ యాక్ట్’’ అని పేరుపెట్టారు. దీని ద్వారా జపాన్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా మరియు నాటోతో సహా అగ్రశ్రేణి US మిత్రదేశాలతో సమానంగా భారతదేశాన్ని పరిగణించాలని కోరారు. సాంకేతిక బదిలీ చేయాలని సూచించారు.

Read Also: Kasthuri: నటి కస్తూరి భర్త, కొడుకు, కూతుళ్ల గురించి తెలుసా?

జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్ట్జ్:

భారత్‌కి అత్యంత సన్నిహితుడిగా మైక్ వాల్ట్జ్‌ని పేర్కొన్నారు. చాలా సందర్భాల్లో పాకిస్తాన్‌ని తీవ్రంగా విమర్వించారు. పాక్ గురించి మాట్లాడుతూ.. ‘‘ ఉగ్రవాదం విదేశాంగ విధానానికి సాధనం కాదు. అది లష్కరే తోయిబా, ఉగ్రవాదులు కావచ్చు ఆమోదయోగ్యం కాదు. పాక్ ప్రభుత్వం, పాకిస్తానీ మిలిటరీ, ఇంటెలిజెన్స్ సర్వీస్(ఐఎస్ఐ) వీటిని నిరోధించాలి’’ అని చెప్పారు.

US నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బర్డ్:

అమెరికా ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా నియమితులైన తులసీ గబ్బార్డ్, అత్యున్నత పదవిని సంపాదించారు. ఈమె కింద 18 ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు పనిచేయబోతున్నాయి. ఈమె పాకిస్తాన్‌కి గట్టి వ్యతిరేకి, పలు సందర్భాల్లో మైనారిటీ హిందువులపై ఆ దేశం చేస్తున్న దాడుల్ని ఖండించారు. 2011లో పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌లో యుఎస్ నేవీ సీల్స్ ఆపరేషన్‌లో మరణించిన అప్పటి అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌కు ఆశ్రయం కల్పించినందుకు ఆమె అనేక సందర్భాల్లో పాకిస్తాన్‌ను నిందించింది.

CIA చీఫ్ జాన్ రాక్లిఫ్:

సీఐఏ చీఫ్ జాన్ రాట్ క్లిఫ్‌గా నియమితులవ్వడం కూడా పాకిస్తాన్‌కి మింగుడు పడటం లేదు. ఈయనకు కూడా పాకిస్తాన్ అంటే మంచి అభిప్రాయం లేదు.

Show comments