Whoever builds Tipu Sultan’s statue will be sent home, BJP minister’s warning: కర్ణాటక మైసూరులో 100 అడుగుల పొడవైన టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని నిర్మిస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే తన్వీర్ సైత్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి శనివారం కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని నిర్మించకోనివ్వండి.. వారికి ఎవరు మద్దతు ఇచ్చినా.. టిప్పు విగ్రహాలను నిర్మించినా ప్రజలు వారిని ఇంటికి పంపిస్తారని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు.
Read Also: Warangal Crime: మద్యం మత్తులో కన్నకూతురిపై అఘాయిత్యం.. మనిషేనా..?
మైసూరు లేదా శ్రీరంగపట్నంలో 100 అడుగుల టిప్పు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని.. ఇది తన చుట్టూ ఉన్న వాస్తవ చరిత్రకు ప్రతీకగా నిలుస్తుందని నరసింహరాజ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే తన్వీర్ సైత్ అన్నారు. బీజేపీ ప్రభుత్వం టిప్పు సుల్తాన్ చుట్టూ ఉన్న చరిత్రను వక్రీకరిస్తోందని.. టిప్పు వారసత్వాన్ని తొగించేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. అందుకనే విగ్రహాన్ని తక్షణమే నిర్మించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ధార్వాడ్ లో టిప్పు జయంతిని జరుపుకోవాలన్న కర్ణాటక పౌరసంఘం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. బీజేపీ నిరసన ర్యాలీకి ప్లాన్ చేసింది. దీంతో పోలీసులు పలువురు బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది జరిగిన తర్వాత కేంద్ర మంత్రి జోషి ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాల్లో భాగంగా కడప మైదాన్ గ్రౌండ్స్ కు బీజేపీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. మరోవైపు ప్రతిపక్ష నేత సిద్ధ రామయ్య యోధుల చరిత్రను బీజేపీ వక్రీకరించే పనిలో ఉందని విమర్శించారు. టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఎందుకు నిర్మించలేరు..? ఆయనకు విగ్రహం పెట్టే అర్హత లేదా..? అని ప్రశ్నించారు. బీజేపీ చరిత్రను వక్రీకరిస్తోందని ఆయన సిద్ధరామయ్య అన్నారు. గతంలో ఈద్గా మైదాన్ లో గణేష్ ఉత్సవాలు జరుపుకున్న తర్వాత ఎంఐఎం టిప్పు జయంతి కోసం ఎంఐఎం అనుమతి కోరింది. దీనికి కర్ణాటక పౌరసంఘం అనుమతించింది.