Waqf: ‘‘ముస్లింలు నమాజ్ చేసే ఏ స్థలమైనా వక్ఫ్ ప్రావర్టీనే’’.. తృణమూల్ ఎంపీ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్.
- ముస్లింలు నమాజ్ చేసే ప్రతీ చోటు వక్ఫ్ ప్రాపర్టీనే..
- తృణమూల్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ కామెంట్స్..
- తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Waqf: కేంద్ర వక్ఫ్ సవరణ బిల్లును తీసుకువస్తోంది. ఇప్పటికే దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో పార్లమెంట్ ఉభయసభలకు చెందిన అధికార, ప్రతిపక్ష ఎంపీలు సభ్యులుగా ఉన్నారు. ఈ శీతాకాల సమావేశాల్లోనే కమిటీ తన రిపోర్టుని పార్లమెంట్‌కి సమర్పించాల్సి ఉన్నా, కమిటీ కాల పరిమితిని వచ్చే ఏడాది బడ్జెట్ సమావేశాలకు పెంచారు. వక్ఫ్ బిల్లు ద్వారా వక్ఫ్ బోర్డుల అపరిమిత అధికారాలను కట్టడి చేయనున్నారు. అయితే, ప్రతిపక్షాలు మాత్రం ఇది మతస్వేచ్ఛని దెబ్బతీయడమే అంటూ కామెంట్స్ చేస్తున్నాయి.
Read Also: Maharashtra: కేంద్ర పరిశీలకులుగా నిరలమ్మ, విజయ్ రూపానీ! షిండే కుమారుడికి కీలక పదవి?
Also Read
- Jantar mantar: దేశ రాజధాని స్తంభించబోతోందా?
- Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
ఇదిలా ఉంటే, తాజాగా మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ కళ్యాణ్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బెనర్జీ మాట్లాడుతూ.. ‘‘ముస్లింలు నమాజ్ చేసే ఏ ప్రదేశమైనా ఆటోమేటిక్‌గా వక్ఫ్ ఆస్తిగా పరిగణించబడుతుంది.’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ అవుతోంది. ఆయన వ్యాఖ్యల ప్రకారం.. నమాజ్ కోసం ఉపయోగించే రోడ్డు, రైల్వే ట్రాక్స్, విమానావ్రయాలు, పార్కులు, ఇతర ప్రాంతాలు, బహిరంగ ప్రదేశాలు వక్ఫ్ ప్రాపర్టీగా క్లెయిమ్ చేయవచ్చని సూచిస్తున్నాయని, కొల్కతాలో ముఖ్యమైన ప్రాంతాలతో సహా పెద్ద మొత్తంలో భూములు ముస్లిం సమాజానికి బదిలీ చేయబడుతున్నాయని బీజేపీ ఆరోపించింది.
ఓట్ల కోసం ఇలాంటివి ప్రోత్సహించినట్లైతే బెంగాలీ హిందూ సమాజం అనేక సవాళ్లను ఎదుర్కొంటుందని, వారి స్వస్థలమైన పశ్చిమ బెంగాల్ విడిచివేళ్లే ప్రమాదం ఉందని, పాకిస్తాన్-బంగ్లాదేశ్ వలే బెంగాల్లో హిందువులు పూర్తిగా నిర్మూలించేలా టీఎంసీ, మమతా బెనర్జీ చర్యలు చేపడుతున్నారని బీజేపీ నేత అమిత్ మాల్వియా ఆగ్రహం వ్యక్తం చేశారు. వక్ఫ్ బిల్లుని వ్యతిరేకిస్తూ టీఎంసీ ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిందని, కళ్యాణ్ బెనర్జీ ఇష్టానుసారంగా మాట్లాడటం లేదని, ఆయన మమతా ఉద్దేశాలనే చెబుతున్నాడని మాల్వియా ఆరోపించారు.
Yesterday, TMC MP Kalyan Banerjee, also a member of the Parliament Committee on Waqf, announced that any place where Muslims offer Namaz would automatically be considered a Waqf property.
Today, TMC Govt is bringing in a Bill in the State Assembly to oppose the Waqf Amendments.… https://t.co/QZB5DGvBZY
— Amit Malviya (@amitmalviya) December 2, 2024
తాజావార్తలు
-
Jantar mantar: దేశ రాజధాని స్తంభించబోతోందా?
-
JasonSanjay : హీరోగా ఎంట్రీ ఇస్తున్న జాసన్ సంజయ్.. దర్శకుడు ఎవరంటే?
-
Smit Machhar: భారత పైలట్‌కు ఇజ్రాయెల్ అధ్యక్షుడి పురస్కారం.. ‘ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం’
-
STAR LINK: మస్క్ చేతిలో డేంజర్ వెపన్! ఈ కారణంతోనే కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తోందా?
-
Vaibhav Sooryavanshi: “బుడ్డోడి విధ్వంసం”.. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!