NTV Telugu Site icon

CM Yogi: ‘‘ మీ ఇంటిని కాల్చి, మీ తల్లిని ఇస్లామిక్ మిలీషియా చంపడం మరిచిపోయారా ఖర్గే జీ?’’

Cm Yogi

Cm Yogi

CM Yogi: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం వాడీవేడిగా కొనసాగుతోంది. ముఖ్యంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. మంగళవారం సీఎం యోగి మాట్లాడుతూ.. ఖర్గే చిన్నతనం నాటి ఘటనను గుర్తు చేశారు. సాధువులు, కాషాయం ధరించిన వారు రాజకీయం చేయొద్దని ఖర్గే చేసిన వ్యాఖ్యలు ధీటుగా బదులిచ్చారు.

‘‘ బ్రిటీష్ హయాంలో, అప్పటి రాజరిక రాష్ట్రం హైదరాబాద్‌లోని ఒక గ్రామంలో ఖర్గే ఇంటిని ఇస్లామిక్ మిలీషియా దహనం చేయడంతో ఆతడి తల్లి, కుటుంబ సభ్యులు మరణించారు. ఖర్గే తన భావాలను దాచుకుని కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కోసం పనిచేస్తున్నారు’’ అని యోగి అన్నారు. ‘‘ఖర్గేకి నాపై కోపం ఉంది. కానీ యోగికి దేశం ముందుంటుంది. మీకు మాత్రం కాంగ్రెస్‌ని బుజ్జగించడమే ప్రధానం’’ అని యోగి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read Also: Indira Eegalapati : సౌదీ అరేబియాలోని రియాద్ మెట్రోను నడపనున్న హైదరాబాద్‌ మహిళ

‘‘ఖర్గే గ్రామం నిజాం పాలనలోని హైదరాబాద్‌లో ఉండేది. భారతదేశం బ్రిటీష్ వారి ఆధీనంలో ఉన్నప్పుడు, హిందువులను టార్గెట్ చేసి చంపుతున్న సమయంలో ఖర్గే ఇంటికి నిప్పు పెట్టారు. తన తల్లి, కుటుంబ సభ్యులు చనిపోయారు. ఈ విషయం ఖర్గేకి తెలుసు కానీ ఓట్ల కోసం కుటుంబ త్యాగాన్ని మరిచిపోయారు’’ అని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.

అంతకుముందు, ఆదివారం ఖర్గే మాట్లాడుతూ.. ‘‘బాటేంగే తో కటేంగే’’ అనే యోగి నినాదాన్ని విమర్శించారు. “చాలా మంది (రాజకీయ) నాయకులు సాధువుల వేషధారణలో బతుకుతూ రాజకీయ నాయకులు అవుతారు.. కొందరు ముఖ్యమంత్రులు కూడా అవుతారు. గెరువ (కుంకుమ) బట్టలు వేసుకుంటారు, తలపై వెంట్రుకలు కూడా ఉండవు… తెల్లని బట్టలు ధరించి, సన్యాసివి అయితే రాజకీయాల నుంచి తప్పుకో” అంటూ ఖర్గే వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది.

హిందువులు విడిపోతే, నాశనం అవుతారని యోగి ‘‘బాటేంగే తో కటేంగే’’ నినాదాన్ని తీసుకువచ్చారు. బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా రాజీనామా చేసిన తర్వాత ఆ దేశంలో హిందువులపై దాడులను ఉద్దేశిస్తూ యోగి ఈ వ్యాఖ్యలు చేశారు. హర్యానా ఎన్నికల్లో ఈ నినాదం వైరల్‌గా మారాయి. ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ఈ నినాదం సంచలనంగా మారింది. 288 అసెంబ్లీ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో నవంబర్ 20న పోలింగ్ జరుగనుంది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

Show comments