Here is Steps How to book LPG Gas Cylinder through WhatsApp: ఒకప్పుడు ‘గ్యాస్ సిలిండర్’ బుక్ చేయాలంటే గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వచ్చేది. టెక్నాలజీ పెరిగాక ఆ పరిస్థితుల నుంచి ఉపశమనం లభించింది. స్మార్ట్‌ఫోన్ వచ్చాక గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే ప్రక్రియ చాలా సులభంగా మారింది. గ్యాస్ ఏజెన్సీ నంబర్‌కు కాల్ చేసినా లేదా వెబ్‌సైట్‌లో ఆర్డర్ చేసినా సిలిండర్ బుక్ అయ్యేది. అయితే గ్యాస్ కంపెనీలు సిలిండర్ బుక్ చేసుకునే విధానాన్ని మరింత సులభతరం చేశాయి. వాట్సప్‌లో ఒక్క మెసేజ్ పెడితే చాలు సిలిండర్ ఇంటికి వచ్చేస్తుంది.
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల బుకింగ్ ఇక నుంచి వాట్సప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఆయిల్ కంపెనీలు తాజాగా ఈ పద్ధతిని ప్రవేశ పెట్టాయి. హెచ్‌పీ, భారత్ గ్యాస్, ఇండెన్ వంటి కంపెనీల గ్యాస్ సిలిండర్లను వాట్సప్ ద్వారా బుకింగ్ చేసుకునే వెలుసుబాటు కల్పించాయి. మీకు కావాల్సిన కంపెనీ వాట్సాప్ నంబర్‌కు నేరుగా ఒక్క మెసేజ్ పెట్టి.. సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. అలాగే కొత్త కలెక్షన్ కూడా వాట్సాప్ ద్వారా తీసుకోవచ్చు. ఇందుకోసం వాట్సప్‌లో కొత్త కనెక్షన్ ఆప్షన్ ఎంపిక చేసుకుంటే చాలు.
Also Read: Today Gold Price: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తాజా రేట్స్ ఇవే!
హెచ్‌పీ గ్యాస్ వినియోగదారులు 9222201122 నంబర్‌కు వాట్సప్‌లో మెసేజ్ పెట్టాలి. వాట్సప్‌లో Hi అని టైప్‌చేసి సెండ్ చేయాలి. ఆ త్వరాత వచ్చే మెనూలో పలు రకాల సేవలు వస్తాయి. అందులో మీకు అవసరమైన ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. అయితే ముందుగా మీ ఫోన్లో ఈ నెంబర్‌ను సేవ్ చేసుకోవాలి. భారత్ గ్యాస్ వినియోగదారులు 1800224344 నంబర్‌కు, ఇండేన్ గ్యాస్ వినియోగదారులు 7588888824 లేదా 7718955555 నంబర్‌కు వాట్సాప్‌లో మెసేజ్ పెట్టాలి.
వాట్సప్‌లో బుకింగ్ విధానం (WhatsApp LPG Gas Booking):
# నంబర్‌ను ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి.
# నంబర్‌కు వాట్సప్‌లో Hi అని మెసేజ్ చేయాలి.
# బుకింగ్, సిలిండర్ పేమెంట్, రివార్డ్స్ అండ్ ఆఫర్స్ వంటి ఆప్షన్లు వస్తాయి.
# బుకింగ్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే.. పేమెంట్ లింక్ వస్తుంది (గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే ద్వారా పేమెంట్ చేయవచ్చు)
# పేమెంట్ కంప్లీట్ చేశాక గ్యాస్ బుకింగ్ అయినట్లు మెసెజ్ వస్తుంది.
# వాట్సాప్‌లోనే బుకింగ్ నెంబర్, సిలిండర్ డెలివరీకి సంబంధించిన పూర్తి వివరాలు మెసెజ్ రూపంలో వచ్చేస్తాయి.
Also Read: Big Pay Hike: టీచర్లకు గుడ్‌న్యూస్.. భారీ వేతన పెంపును ప్రకటించిన సర్కారు!