Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

* ఐపీఎల్‌లో నేడు ముంబైతో తలపడనున్న హైదరాబాద్‌, ముంబై వేదికగా రాత్రి 7.30కి మ్యాచ్‌ ప్రారంభం..

* హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,250,

* నేడు కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన, ఓర్వకల్ మండలం గుమ్మటం తాండా వద్ద నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్‌ను పరిశీలించనున్న సీఎం.

* మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డికి కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి పిలుపు, ఢిల్లీ వెళ్లిన మాజీ సీఎం, నేడు సోనియా, రాహుల్‌ గాంధీతో భేటీ.

* తిరుమలలో ఇవాళ్టి నుంచి అష్టదళపాదపద్మారాధన సేవ పున:ప్రారంభం, వేసవిలో భక్తుల రద్దీ దృష్యా గత వారం నుంచి వారపు సేవలు రద్దు చేసిన టీటీడీ.

* తూర్పుగోదావరి: నేటి నుంచి జూన్ 30 వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రంథాలయాల్లో వేసవి విజ్ఞాన శిబిరాలు, విద్యార్థులని విజ్ఞాన శిబిరాల్లో భాగస్వామ్యం చేసేలా ఏర్పాట్లు.

* నేడు ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా పర్యటన, పాడేరులో మొదకొండమ్మ జాతరలో పాల్గొననున్న మంత్రి.

* పల్నాడు జిల్లాలో నేడు పులిచింతల ప్రాజెక్టును పరిశీలించనున్న మంత్రి అంబటి రాంబాబు.

* శ్రీకాకుళం: నేటి నుంచి ఎచ్చెర్ల మండలం బొంతలకోడూరులో అమ్మవారి ఉత్సవాలు.. 14 ఏళ్ల తర్వాత వైభవంగా మహోత్సవాలు

* శ్రీకాకుళం: ఆమదాలవలస మండలం జొన్నవలస గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న స్పీకర్ తమ్మినేని సీతారాం

* నేడు రాజమండ్రిలో పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పర్యటన

* నేడు చిత్తూరు నడివిది గంగమ్మ జాతర, తొలిపూజతో నడివీధి గంగమ్మ జాతర వంశపారపర్య ధర్మకర్త , మాజీ ఎమ్మెల్యే సీకే బాబు. కోవిడ్ కారణంగా గత రెండు సంవత్సరాలుగా జరగని గంగమ్మ జాతర

Exit mobile version