* ఏఐసీసీ అధ్యక్ష పదవికి నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు.. రేసులో శశిథరూర్, దిగ్విజయ్ సింగ్, కమల్‌నాథ్, ఖర్గే, వేణుగోపాల్,
* నేడు ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష, ద్రవ్యోల్బణం అదుపునకు వడ్డీరేట్లు పెంచే అవకాశం
* నేడు జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం.. అవార్డులను ప్రదానం చేయనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
* నేడు కర్ణాటకలో అడుగుపెట్టనున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర
* నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్.. ఉదయం 11:30కు యాదగిరిగుట్టకు రోడ్డు మార్గంలో చేరుకోనున్న కేసీఆర్… వచ్చే నెల 5వ తేదీన టీఆర్ఎస్ పార్టీ ఎల్పీ కీలక సమావేశం జరగనున్న నేపథ్యంలో కేసీఆర్ పర్యటనకు ప్రాధాన్యం.
* రేపటి నుంచి అమల్లోకి వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా పథకం.. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు వెబ్‌సైట్‌ను ప్రారంభించనున్న సీఎం జగన్
* శ్రీశైలంలో ఐదోవరోజు దసరా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు.. సాయంత్రం స్కందమాత అలంకారంలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనం, శేషవాహనంపై ఆశీనులై పూజలందుకోనున్న ఆదిదంపతులు, రాత్రి పురవీధుల్లో కన్నులపండువగా స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం
* తిరుమల: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో నాల్గో రోజు, ఇవాళ ఉదయం కల్పవృక్షవాహనం పై, రాత్రి సర్వభూపాల వాహనంపై భక్తులుకు దర్శనం ఇవ్వనున్న స్వామివారు.. ఇవాళ మధ్యహ్నం 12 గంటల నుంచి ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలను అనుమతి లేదని టీటీడీ ప్రకటన
* బాపట్ల: నేడు వేమూరులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి మేరుగ నాగార్జున.
* పల్నాడు : సత్తెనపల్లిలో నేడు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి అంబటి రాంబాబు…
* తూర్పుగోదావరి జిల్లా : నేడు రాజమండ్రి దేవిచౌక్ లో బాలత్రిపుర సుందరి దేవి అలంకరణతో భక్తులకు దర్శనం ఇస్తున్న అమ్మ వారు, 89వ దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 5వ రోజు పోటెత్తిన భక్తులు
* గుంటూరు: రేపటి నుండి అక్టోబర్ 5 వరకు గుంటూరు మిర్చి యార్డుకు దసరా సెలవులు…
* అంబేద్కర్ కోనసీమ: నేడు రామ చంద్ర పురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు లో పాల్గొనున్న మంత్రి వేణు
* అనకాపల్లిజిల్లా: నేడు చోడవరం (మం) గోవాడ షుగర్ ఫ్యాక్టరీ మాహాజన సభ… హాజరు కానున్న డిప్యూటీ సీఎం ముత్యలనాయుడు
* కాకినాడ: నేడు తునిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి దాడిశెట్టి రాజా
* పార్వతీపురం మన్యం జిల్లా: సాలూరు మెంటాడవిధి కోదండ కళ్యాణమండపములో నేడు వైస్సార్ చేయూత కార్యక్రమం.. పాల్గొనున్న డిప్యూటీ సీఎం రాజన్నదొర.
* అనంతపురం : కళ్యాణదుర్గం పట్టణ పరిధిలోని 21వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఉషశ్రీ చరణ్
* విశాఖ శ్రీ శారదాపీఠంలో శరన్నవరాత్రి మహోత్సవాలు, లలితా త్రిపుర సుందరి అవతారంలో రాజశ్యామల అమ్మవారు
* కర్నూలు: నేడు మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామిని దర్శించుకోనున్న కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి.
* ఏలూరు జిల్లా: నేడు ద్వారకాతిరుమల మండలంలో కొనసాగనున్న అమరావతి రైతుల పాదయాత్ర.. రాత్రికి ద్వారకా తిరుమలలో బస చేయనున్న రైతుల బృందం
* ఇంద్రకీలాద్రి: శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఐదవ రోజున కనకదుర్గమ్మ శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా దర్శనం… శుక్రవారం కావటంతో పెరిగిన భక్తుల తాకిడి.
* వరంగల్ : శ్రీ భద్రకాళి శరన్నవరాత్రి మహోత్సవాలు, ఐదవ రోజు రాజరాజేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనం.. అమ్మవారికి ఉదయం పల్లకి సేవ, శేష వాహన సేవ, సాయంత్రం సాలభంజిక సేవ
* రాజన్న సిరిసిల్ల: వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు స్కందమాత అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు
* సంగారెడ్డి: నేడు ఆందోల్ నియోజకవర్గంలో వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర, ఆందోల్-జోగిపేట మండలాల్లో కొనసాగనున్న పాదయాత్ర, సాయంత్రం నాలుగు గంటలకు జోగిపేట బస్టాండ్ దగ్గర బహిరంగ సభ