Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* గుజరాత్‌: నేటి నుంచి జాతీయ క్రీడలు… ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ

* నేడు ఢిల్లీకి దిగ్విజయ్‌ సింగ్.. ఇవాళ సోనియా గాంధీతో అశోక్‌ గెహ్లాట్‌ భేటీ.. రేపు నామినేషన్‌ వేసే అవకాశం, ఇప్పటికే బరిలో శశిథరూర్‌, పోటీకి సుముఖంగా ఉన్న మల్లిఖార్జున ఖర్గే, రేపటితో ముగియనున్న నామినేషన్ల గడువు

* ఐదో రోజు బతుకమ్మ వేడుకలు.. నేడు అట్ల బతుకమ్మ ఉత్సవాలు.. అట్లను గౌరమ్మకు నివేదించనున్న భక్తులు

* తిరుమలలో మూడోరోజు ఘనంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఇవాళ సింహ వాహనంపై స్వామివారి ఊరేగింపు, రాత్రి ముత్యపు పందిరి వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీవారు

* హైదరాబాద్‌: నేడు మరోసారి మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని ప్రశ్నించనున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌

* తిరుమల: నేడు వృద్ధులు, దివ్యాంగుల ఉచిత దర్శన టికెట్లు విడుదల.. అక్టోబర్‌ నెలకు సంబంధించిన ఉచిత దర్శన టికెట్లు ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్న టీటీడీ

* విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వైభవంగా దేవినవరాత్రులు.. అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దుర్గమ్మ దర్శనం, బంగారు పాత్రలో ఈశ్వరుడికి బిక్ష అందించే రూపంలో అమ్మవారు

* నంద్యాల: నేడు శ్రీశైలంలో 4వ రోజు దేవిశరన్నవరాత్రి మహోత్సవాలు.. సాయంత్రం కూష్మాండదుర్గ అలంకారంలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనం, కైలాస వాహనంపై ఆశీనులై పూజలందుకోనున్న స్వామి అమ్మవారు

* నేడు సిద్దిపేట జిల్లాలో ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి హరీష్ రావు

* ఖమ్మం: నేడు ఎర్రుపాలెం మండలంలో పర్యటించనున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

* భద్రాద్రి: నేడు భద్రాచలం రామాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో ధనలక్ష్మి అవతారంలో ధర్శనమివ్వనున్న అమ్మవారు

* పశ్చిమగోదావరి జిల్లా: నేడు మొగల్తూరులో కేంద్ర మాజీ మంత్రి , సినీ నటులు కృష్ణంరాజు సంస్మరణ సభ.. హాజరుకానున్న కృష్ణంరాజు కుటుంబ సభ్యులు

* ఏలూరు జిల్లా: 17వ రోజు కొనసాగనున్న అమరావతి రైతుల పాదయాత్ర.. నేడు దెందులూరు మండలంలోని కొవ్వలి, శ్రీరామవరం, పెరుగుగూడెం మీదుగా సాగనున్న యాత్ర

* పల్నాడు జిల్లా: నేడు చిలకలూరిపేట మండలం గోవిందాపురంలో మంత్రి విడదల రజిని పర్యటన.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి.

* పల్నాడు జిల్లా: నేడు సత్తెనపల్లి, ముప్పాళ్ళలో‌ మంత్రి అంబటి రాంబాబు పర్యటన, గడప గడపకు‌మన ప్రభుత్వం, వైఎస్సార్ చేయూత కార్యక్రమాలలో పాల్గొనున్న మంత్రి.

* విశాఖ శ్రీ శారదాపీఠంలో శరన్నవరాత్రి మహోత్సవాలు, అన్నపూర్ణ అవతారంలో రాజశ్యామల అమ్మవారు, గరిటె, అన్నపాత్ర చేతపట్టి భక్తులను అనుగ్రహిస్తున్న రాజశ్యామల

* వరంగల్: శ్రీ భద్రకాళి అమ్మవారి దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈరోజు అమ్మవారు మహాలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

Exit mobile version