Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* ఉమెన్స్‌ ఆసియాకప్‌లో నేడు కీలక పోరు.. బంగ్లాదేశ్‌లోని సైల్హట్‌ వేదికగా తలపడనున్న భారత్‌-పాక్‌.. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభం కానున్న మ్యాచ్‌

* నేడే మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ విడుదల.. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ.. ఈ నెల 14 వరకు నామినేషన్ల స్వీకరణ

* పోలవరంపై నేడు కీలక సమావేశం.. ఉదయం 11 గంటలకు వర్చువల్‌గా భేటీకానున్న తెలుగు రాష్ట్రాల అధికారులు.. పోలవరం నిర్మాణం, రాష్ట్రాల అభ్యంతరాలపై చర్చ

* నేడు ఈడీ విచారణకు హాజరుకానున్న డీకే శివకుమార్‌.. కర్ణాటక కాంగ్రెస్‌ చీఫ్‌ డీకేకు ఇప్పటికే యంగ్‌ ఇండియా సంస్థ విచారణ కేసులో ఈడీ సమన్లు..

* కర్ణాటక: నేడు మాండ్య జిల్లాలో రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర.. పాల్గొననున్న ప్రియాంక గాంధీ

* హైదరాబాద్‌: ట్యాంక్‌బండ్‌లో కొనసాగుతోన్న దుర్గమ్మ విగ్రహాల నిమజ్జనం

* కర్నూలు: నేడు హాళగుంద మండలం దేవరగుట్టులో శ్రీ ళమల్లేశ్వరస్వామి రథోత్సవం.

* కర్నూలు: ఎమ్మిగనూరులో నేడు ప్రభుత్వ సాలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మనూర్ జయరాం పర్యటన.. పట్టణ అర్బన్ హెల్త్ సెంటర్, విద్యుత్ లైన్ ప్రారంభించనున్న మంత్రులు

* తూర్పుగోదావరి జిల్లా : నేటి నుండి ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం.. ఆదేశాలు జారీచేసిన రాష్ట్ర విద్యాశాఖ

* ఏలూరు: ద్వారకా తిరుమలలో ఘనంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలు.. పంచాయుధ నారాయణుడు అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న చిన వెంకన్న, ఉదయం సూర్యప్రభ, రాత్రికి చంద్రప్రభ వాహనాలపై స్వామి వారి ఊరేగింపు

* నేడు మెదక్, సిద్దిపేట జిల్లాల్లో ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి హరీష్ రావు

Exit mobile version