NTV Telugu Site icon

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* టీ 20 వరల్డ్‌ కప్‌: నేటి నుంచి సూపర్‌ 12 మ్యాచ్‌లు.. ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్‌ ఢీ

* టీ 20 వరల్డ్‌ కప్‌లో ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు పెర్త్‌ వేదికగా ఇంగ్లండ్‌ – ఆఫ్ఘనిస్థాన్‌ మధ్య మ్యాచ్‌

* టీ20 వరల్డ్‌ కప్‌లో రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు ఇండియా – పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్.. 27న మధ్యాహ్నం 12.30 గంటలకు భారత్-నెదర్లాండ్స్‌ మ్యాచ్‌.. 30న సాయంత్రం 4.30 గంటలకు ఇండియా-సౌతాఫ్రికా మ్యాచ్‌.. నవంబర్‌ 2న మధ్యాహ్నం 1.30 గంటలకు ఇండియా-బంగ్లాదేశ్‌ మ్యాచ్‌, నవంబర్‌ 6న మధ్యాహ్నం 1.30కి ఇండియా-జింబాబ్వే మ్యాచ్

* విజయవాడ: దీపావళి పండుగ నేపథ్యంలో నేటి నుంచి ప్రత్యేక రైళ్లు.. తిరుపతి-శ్రీకాకుళం మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్న దక్షణ మధ్య రైల్వే

* తెలంగాణ రాజకీయాల్లో హీట్‌ పెంచుతున్న మునుగోడు ఉప ఎన్నికలు.. నేడు మునుగోడులో అధికార, ప్రతిపక్షాలకు చెందిన నేతల ప్రచారం..

* బాపట్ల : చీరాల వైకుంఠపురo దర్గాలో మూడు రోజుల పాటు 51వ గంధం ఉరుసు మహోత్సవం..

* గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఏపీ పీసెట్ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ గడువు నేటితో ముగింపు…

* అంబేద్కర్ కోనసీమ: నేడు రామచంద్రపురం నుండి కాకినాడ జిల్లా కరప మండలం విజయ రాయుడు పాలెం వరకు సాగనున్న అమరావతి రైతులు పాదయాత్ర.. ద్రాక్షారామలో భీమేశ్వర స్వామి దర్శనం చేసుకోనున్న రైతులు

* పల్నాడు: గురజాలలో నేటితో ముగియనున్న ముత్యాలమ్మ అమ్మవారి జాతర…

* నెల్లూరు జిల్లా ముత్తుకూరు.మండలం నారికేళ్ల పల్లి లో పర్యటించనున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

* నెల్లూరు: జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 రాకెట్ ప్రయోగానికి మొదలైన కౌంట్ డౌన్.. 24 గంటల కౌంట్ డౌన్ అనంతరం రాకెట్‌ ప్రయోగం.. యూకేకు చెందిన 36 నానో ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చనున్న శాస్త్రవేత్తలు.. ప్రయోగ ప్రక్రియపై శాస్త్రవేత్తలతో ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ సమావేశం

* ఏలూరు జిల్లా: పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్న జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు.. అనంతరం ధవళేశ్వరంలో జలవనరుల శాఖ అధికారులతో సమావేశం లో పాల్గొనున్న మంత్రి

* తూర్పుగోదావరి జిల్లా: సర్ ఆర్థర్ కాటన్ ఆనకట్ట కట్టడాన్ని ప్రపంచ చారిత్రక కట్టడంగా గుర్తింపు పొందిన సందర్భంగా నేడు ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద అభినందన సభ.. ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా పాల్గొననున్న మంత్రి అంబటి రాంబాబు.. హాజరుకానున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రతిజాత్రినిధులు, అధికారులు

* అనంతపురం : కళ్యాణదుర్గం మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఉషశ్రీ చరణ్ .

* విజయవాడ చెస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నేడు, రేపు రాష్ట్ర స్థాయి మహిళ చెస్ టోర్నమెంట్ పోటీలు

* విజయవాడ: నేటి నుంచి ఏపీ పీజీ సెట్ కౌన్సిలింగ్ ప్రారంభం

* శ్రీ సత్య సాయి జిల్లా: హిందూపురం మండలంలోని తూమకుంట 132 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లో మరమ్మతుల కారణంగా పలు గ్రామాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వర కు విద్యుత్ సరఫరాలో అంతరాయం

* విజయనగరం: నేడు బొబ్బిలి ప్రజలకు త్రాగునీటిని అందించడానికి నిర్మించిన మంచినీటి రిజర్వాయర్‌ను ప్రారంభించనున్న మంత్రి బొత్స సత్యనారాయణ.

* పార్వతీపురం మన్యం జిల్లా: నేడు బోస్ బొమ్మ జంక్షన్ లో 108, 104 వాహనాలను ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం రాజన్నదొర

Show comments