NTV Telugu Site icon

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* టీ20 వరల్డ్‌కప్‌లో నేడు ఉదయం 9.30 గంటలకు వెస్టిండీస్‌తో తలపడనున్న ఐర్లాండ్‌

* టీ20 వరల్డ్‌కప్‌లో మధ్యాహ్నం 1.30 గంటలకు జింబాబ్వేతో ఢీకొట్టనున్న స్కాట్‌లాండ్‌

* బంగాళాఖాతంలో కొనసాగుతోన్న అప్పపీడనం.. నేడు వాయుగుండంగా మారే అవకాశం.. 48 గంటల్లో తుఫాన్‌గా మారనున్న వాయుగుండం

* నేడు కేదారానాథ్‌, బద్రీనాథ్‌లను సందర్శించనున్న ప్రధాని నరేంద్ర మోడీ.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని

* అమరావతి: నేడు ఇరిగేషన్‌ శాఖపై సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సమీక్ష..

* నేడు మునుగోడులో మంత్రి కేటీఆర్‌ పర్యటన.. ఉప ఎన్నికల ప్రచారం, రోడ్‌షోలో పాల్గొనున్న కేటీఆర్

* నేడు ఆస్ట్రేలియాకు కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. నవంబర్‌ 7న తిరిగి హైదరాబాద్‌ రానున్న వెంకట్‌రెడ్డి..

* తిరుమల: ఇవాళ శ్రీవారి అర్జిత సేవా టికెట్లు విడుదల.. ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్న టీటీడీ..

* కర్నూలు: మంత్రాలయం దేవాలయం సర్కిల్‌ నుంచి భారత్‌ జోడో యాత్ర.. ఏపీలో 120 కిలోమీటర్లు సాగిన రాహుల్‌ గాంధీ పాదయాత్ర

* నేడు కర్ణాటకలోకి ప్రవేశించనున్న భారత్‌ జోడో యాత్ర.. వీడ్కోలు పలకనున్న ఏపీ నేతలు.. ఎల్లుండి తెలంగాణలోకి ప్రవేశించనున్న రాహుల్‌ గాంధీ పాదయాత్ర

* గుంటూరు: నేడు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించనున్న జిల్లా పోలీసు ఉన్నతాధికారులు..

* పల్నాడు: నేడు పలనాడు జిల్లా పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొననున్న జిల్లా ఇంఛార్జి మంత్రి కారుమూరు నాగేశ్వరరావు,.. మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని పలువురు జిల్లా ఉన్నతాధికారులు.

* నేటి నుంచి ప్రారంభం కానున్న అన్నవరం సత్యదేవుని దీక్షలు.. కార్తీక మాసం ప్రారంభానికి ముందు వచ్చే సత్యదేవుని జన్మ నక్షత్రం నుంచి దీక్షలు ప్రారంభం.. నవంబర్ 17 దీక్ష విరమణ, ఏర్పాట్లు చేసిన దేవస్థాన అధికారులు

* బాపట్ల జిల్లా పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి మెరుగ నాగార్జున, జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ , బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తదితరులు.

* విశాఖ: నేడు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా బీచ్ రోడ్ లో అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించనున్న జిల్లా పోలీసు ఉన్నతాధికారులు… కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి గుడివాడ అమర్నాథ్, జిల్లా అధికారులు

* తూర్పు గోదావరి జిల్లా : నేడు అనపర్తి నియోజకవర్గం రామవరం నుంచి ప్రారంభంకానున్న 40వ రోజు అమరావతి రైతుల మహా పాదయాత్ర.. రామవరం నుండి రాయవరం మీదుగా రామచంద్రాపురం వరకూ నేటి పాదయాత్ర

* గుంటూరు: నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని 205 కేంద్రాల్లో ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు…

* అనంతపురం : సూర్యగ్రహణం నేపథ్యంలో ఈనెల 25 పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం మూసివేత..

* విజయవాడ: నేడు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎస్ఆర్ఆర్ కళాశాలలో జాబ్ మేళా..

* తూర్పుగోదావరి జిల్లా: నేడు హోం శాఖ మంత్రి తానేటి వనిత పర్యటన..

* శ్రీకాకుళం: పోలీస్ అమరవీరుల దినోత్సవ పెరేడ్ కు హాజరుకానున్న స్పీకర్ తమ్మినేని సీతారాం.