NTV Telugu Site icon

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today New

Whats Today New

* ఆక్లాండ్‌: నేడు భారత్‌ – న్యూజిలాండ్‌ మధ్య క్రికెట్‌ మ్యాచ్‌… టాస్‌గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌..

* తిరుమల: ఇవాళ ఆన్‌లైన్‌లో అంగప్రదక్షణ టోకెన్లు విడుదల చేయనున్న టీటీడీ.. డిసెంబర్‌ మాసానికి సంబంధించిన కోటా విడుదల చేయనున్న అధికారులు.

* ఢిల్లీ: నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి

* నేడు సిద్దిపేట జిల్లాలో ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పర్యటన.. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న హరీష్ రావు

* బాపట్ల, ప్రకాశం జిల్లాల పరిధిలోని కరవది రైల్వే స్టేషన్ నుంచి చినగంజాం, చీరాల వరకు జరిగిన మూడో లైన్ రైల్వే పనులను పరిశీలించనున్న రైల్వే అధికారులు..

* బాపట్ల : సంతమాగులూరులో బాలలు ఎదుర్కొంటున్న సమస్యలపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్..

* పల్నాడు జిల్లా: కారంపూడి పల్నాటి వీరారాధన ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు చాపకూడు కార్యక్రమం.. మందపోరు ఉత్సవానికి హాజరుకానున్న ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజిని, జిల్లా కలెక్టర్, శివశంకర్, ఎస్పీ శివ శంకర్ రెడ్డి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, కాసు మహేష్ రెడ్డి తదితరులు.

* గుంటూరు: నేడు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం లో రెండవ రోజు జగనన్న స్వర్ణోత్సవ సంబరాలు.. హాజరు కానున్న మంత్రులు రోజా, అంబటి రాంబాబు , జిల్లా కలెక్టర్ వేణుగోపాలరెడ్డి తదితరులు.

* బాపట్ల: నేడు అమృతలూరు మండలం పెదపూడి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి మేరుగ నాగార్జున

* నేడు కాకినాడలో పర్యటించినున్న మంత్రి గుడివాడ అమర్నాథ్.. కాకినాడ పోర్టు అభివృద్ధి, మౌలిక సదుపాయాలు విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రి.. యాంకరేజి పోర్టు కార్గో ఎగుమతులు సామర్థ్యాన్ని 91 కోట్లు నిధులు తో 3 మిలియన్ టన్నుల స్థాయికి పెంపు

* గుంటూరు : నేటి నుంచి మూడు రోజులు పాటు గుంటూరులో అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభలు…

* గుంటూరు: తెనాలిలో తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో దివంగత సూపర్ స్టార్ కృష్ణ సంస్మరణ సభ.

* విశాఖ: నేడు ఋషికొండను సందర్శించనున్న సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ.. ఋషికొండ దగ్గర ఏపీ టూరిజం చేపట్టిన భవనాల నిర్మాణాల పరిశీలన, ప్రాజెక్ట్ సైట్లోకి వెళ్ళేందుకు అనుమతించాలని న్యాయస్థానం ద్వారా ఆదేశాలు పొందిన నారాయణ.

* అనంతపురం : కళ్యాణదుర్గం మండల పరిధిలోని బోయలపల్లి గ్రామంలో వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు – భూరక్ష పధకం కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి ఉషశ్రీ చరణ్

* నేడు శ్రీకాకుళం జిల్లా , ఇచ్చాపురం నియోజకవర్గాల్లో పర్యటించనున్న రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు.. కవిటి, ఇచ్చాపురం మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్న మంత్రి ధర్మాన‌

* మెదక్ : నేడు రీజనల్ రింగ్ రోడ్డుపై ప్రజాభిప్రాయ సేకరణకు ప్రజావేదిక.. శివ్వంపేట (మం) దొంతి గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ, రైతుల నుంచి అభిప్రాయాలు స్వీకరించనున్న మెదక్ కలెక్టర్ హరీష్, వివిధ శాఖల అధికారులు

Show comments