NTV Telugu Site icon

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today New

Whats Today New

* టీ20 వరల్డ్‌కప్‌: నేడు రెండో సెమీస్‌లో భారత్‌తో ఇంగ్లాండ్ ఢీ.. ఆడిలైడ్‌ వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్‌.. ఇప్పటికే ఫైనల్‌ చేరుకున్న పాకిస్థాన్‌

* హిమాచల్‌: నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం.. ఈ నెల 12న ఒకే దశలో హిమాచల్‌ అసెంబ్లీ ఎన్నికలు

* హైదరాబాద్‌: నేడు ఉదయం 11 గంటలకు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ప్రమాణస్వీకారం.. కూసుకుంట్లతో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయించనున్న స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి

* నేడు సిద్ధిపేట జిల్లాలో గవర్నర్‌ తమిళిసై పర్యటన.. కొమురవెల్లి మల్లన్న ఆలయాన్ని సందర్శించనున్న గవర్నర్‌

* నేటి నుంచి పోలవరం ముంపుపై సర్వే.. హాజరుకానున్న రెండు రాష్ట్రాల ఇంజినీర్లు

* అంబేద్కర్ కోనసీమ: నేడు ద్రాక్షరామ రానున్న కంచి కామకోటి పీఠాధిపతి.. చంద్రమౌళీశ్వరులు, కామాక్షి అమ్మవారి పీఠంలో త్రికాల పూజలు భక్తులకు అనుగ్రహ భాషణ చేయనున్న శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి

* నేడు అన్నవరం సత్యదేవుని హుండీ ఆదాయం లెక్కింపు.. కార్తీక మాసం 16 రోజులు కానుకలు లెక్కించనున్న సిబ్బంది

* నేడు విశాఖకు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి.. పీఎం, సీఎం పర్యటనల భద్రత ఏర్పాట్లను సమీక్షించనున్న డీజీపీ

* బాపట్ల: చీరాల సురేష్ మహల్‌లో జెట్టి సినిమా యూనిట్ సక్సెస్ మీట్… హాజరుకానున్న చిత్ర దర్శకుడు సుబ్రహ్మణ్యం బృందం..

* బాపట్ల: వేమూరు మండలం చావలి గ్రామంలో నేడు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి మేరుగ నాగార్జున..

* మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో స్వామి వారి మూలబృందావనంకు పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో నేడు తులసి అర్చన, కనకాభిషేకం, పంచామృతభిషకం వంటి విషేశ పూజలు, రాత్రి ఉత్సవమూర్తి ప్రహ్లదరాయులను బంగారు పల్లకి, ఉంజల సేవ, గజ వాహనం, చెక్క, రజిత, స్వర్ణ రథంపై ఉరేగింపు.

* వరంగల్: నేడు పీజీ దంత వైద్య రెండో విడత ప్రవేశాలు.. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం 6 వరకు కళాశాల వారిగా నమోదు ఆప్షన్లు నమోదు.. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం

* వరంగల్: నేడు ఆదర్శ గ్రామమైన గంగదేవిపల్లి గ్రామానికి 16 దేశాల ప్రతినిధుల రాక.. ఆదేశాలలో వివిధ హోదాలలో పట్టిస్తున్న 22 మంది హాజరు .

* ఖమ్మం: నేడు భూపాలపల్లి జిల్లా వాజేడులో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆత్మీయ సమ్మేళనం… తుమ్మలకు మద్దతుగా దమ్మపేట మండలం నుంచి భద్రాచలం మీదుగా వాజేడుకు భారీ కార్ల ర్యాలీ

* నేడు బైరాన్ పల్లిలో రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల స్మారక బురుజును సందర్శించనున్న గవర్నర్‌ తమిళిసై.. అమరవీరుల కుటుంబాలతో ముచ్చటించనున్న గవర్నర్

* గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈనెల 11 నుండి 13 వరకు రాష్ట్రస్థాయి రెవెన్యూ క్రీడలు, సాంస్కృతిక ఉత్సవాలు.. పోటీల్లో పాల్గొననున్న 1200 మంది క్రీడాకారులు, పోటీల్లో పాల్గొనే రెవిన్యూ క్రీడాకారులకు ఐదు రోజులపాటు ప్రత్యేక సెలవులు మంజూరు చేసిన ప్రభుత్వం…

* పశ్చిమ గోదావరి జిల్లా: నేడు తణుకులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావు..

* పశ్చిమ గోదావరి జిల్లా: నేడు పెంటపాడు మండలం రావికంపాడులో దాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ..

* తిరుమల: రేపు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల.. రేపు ఉదయం 10 గంటలకు డిసెంబర్‌ నెల టికెట్లను విడుదల చేయనున్న టీటీడీ

* రేపు గుంటూరు, పల్నాడులో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన.. యడ్లపాడులో స్పైసిస్‌ పార్క్‌లో చిల్లీస్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ప్రారంభం.. గుంటూరులో అబ్దుల్ కలాం ఆజాద్‌ జయంతి వేడుకల్లో పాల్గొననున్న సీఎం