NTV Telugu Site icon

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today New

Whats Today New

* టీ20 వరల్డ్‌కప్‌లో నేడు తొలి సెమీస్‌… పాకిస్థాన్‌తో న్యూజిలాండ్‌ ఢీ.. సిడ్నీ వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్‌

* ఇవాళ సీజేఐగా ప్రమాణం చేయనున్న జస్టిస్‌ చంద్రచూడ్.. ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం.. సీజేఐగా రెండేళ్ల పాటు బాధ్యతలు నిర్వహించనున్న జస్టిస్‌ చంద్రచూడ్‌

* టీ20 వరల్డ్‌ కప్‌లో రేపు రెండో సెమీస్‌.. భారత్‌తో తలపడనున్న ఇంగ్లండ్‌

* ఎల్లుండి విశాఖకు ప్రధాని నరేంద్ర మోడీ.. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న మోడీ..

* ఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ.. అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఇప్పటికే కేంద్రానికి ఆదేశాలు

* హైదరాబాద్‌: రాజాసింగ్‌ పీడీ యాక్ట్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ

* కాకినాడ: నేడు తునిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు లో పాల్గొనున్న మంత్రి దాడిశెట్టి రాజా

* తూర్పుగోదావరి జిల్లా : నేడు రాజమండ్రిలో న్యాయ సేవా దినోత్సవం… జిల్లా కోర్టు ఆవరణలో భారీగా ఏర్పాట్లు

* ఏలూరు జిల్లా: పాన్ ఇండియా ఔట్‌రీచ్ క్యాంపెయిన్‌లలో భాగంగా “లీగల్ సర్వీసెస్ డే” జిల్లా కోర్టు న్యాయ సేవా సదన్ లో లీగల్ సర్వీసెస్ డే కార్యక్రమం, ర్యాలీ..

* ప.గో జిల్లా: అయ్యప్ప స్వామి భక్తుల కోసం నరసాపురం నుంచి ఈనెల 18, 25 తేదీల్లో కొట్టాయంకు ప్రత్యేక రైలు..

* విశాఖ: జనజాగరణ సమితి ఆధ్వర్యంలో పబ్లిక్ లైబ్రరీలో విద్యార్థి, యువజన సదస్సు.. అమరావతి సత్యం-3 రాజధానులు ఒక భ్రమ అనే అంశంపై చర్చ.

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మనుబోలులో జరిగే గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటారు అనంతరం ముత్తుకూరు లో జరిగే వాలీబాల్ టోర్నమెంట్ ను ప్రారంభిస్తారు.

* విశాఖ: నేడు రైల్వే DRM ఆఫీస్ నుంచి జీవీఎంసీ వరకు ర్యాలీ, బహిరంగ సభ నిర్వహిస్తున్న కార్మిక సంఘాలు.. మోడీ పర్యటనలో విశాఖ ఉక్కు సహా ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటూ ప్రకటన చేయాలనే డిమాండ్.

* విశాఖ: ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన కోసం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు.. నేడు ట్రయిల్ రన్.. ఎస్.పి.జి. పర్యవేక్షణలోకి ఆంధ్రా యూనివర్సిటీ పరిసరాలు, సభ జరిగే ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ మీదుగా సాధారణ ప్రయాణీకులు వాహనాలు రాకపోకలు నిషేధం

* విశాఖ: నేడు కలెక్టర్ ను కలిసి పోలీసులపై ఫిర్యాదు చేయనున్న జనసేన… గత నెల 15న పవన్ కళ్యాణ్ పర్యటనలో పోలీసులు అనుసరించిన తీరుపై విచారించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి.

* విశాఖ: నేటి నుంచి ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల పరిశీలన ప్రక్రియ ప్రారంభం.. ఆరు జిల్లాల పరిధిలో 119 మంది తహశీల్దార్‌లకు బాధ్యతలు.. ఓటర్లు నమోదు కోసం వచ్చిన 2.69 లక్షల దరఖాస్తులు.

* నెల్లూరు జిల్లా: నేడు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న ఓషన్ శాట్ ఉపగ్రహం.. బెంగళూరులోని యూఆర్‌ రావు శాటిలైట్ సెంటర్ నుంచి భారీ భద్రత మధ్య తీసుకువచ్చిన అధికారులు.. ఈనెలాఖరులో పి.ఎస్.ఎల్ వి. సి-54 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి ప్రయోగించనున్న శాస్త్రవేత్తలు

* బాపట్ల జిల్లా: నేడు కొల్లూరు మండలం చిలుమూరులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి మేరుగ నాగార్జున.

* పల్నాడు జిల్లా… నేడు చిలకలూరిపేట మండలం రాజాపేటలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్ననున్న మంత్రి విడదల రజిని

* గుంటూరు: పెదకాకాని మండలం తక్కెళ్ళపాడు లో శంకర కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం…

* గుంటూరు: నేటినుంచి మూడు రోజులపాటు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఏపీ రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెవెన్యూ స్పోర్ట్స్, కల్చరల్ మీట్, పాల్గొనున్న 1500మంది క్రీడాకారులు.

* అనంతపురం : నేటి నుంచి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్ – 15 క్రికెట్ టోర్నీ.