Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

* నేడు శ్రీరాముని శోభాయాత్ర.. హైదరాబాద్‌లో పలు చోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలు.. 6 కిలోమీటర్ల మేర సాగనున్న శోభాయాత్ర

* నేడు భద్రాచలంలో శ్రీ సీతా రాముల కళ్యాణం.. హాజరు కానున్న దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, హిమాచలప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కళ్యాణంలో పాల్గొననున్న చిన్న జీయర్ స్వామి

* విజయనగరం: శ్రీరామ నవమి సందర్భంగా రామతీర్థంలో సీతారాముల కల్యాణం… భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు.. ప్రభుత్వం తరుఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రి బొత్స సత్యనారాయణ.. దర్శించుకోనున్న అనువంశక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతి రాజు..

* కడప: ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ.. నేటి నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు.. ఏప్రిల్ 5న సాయంత్రం పండు వెన్నెలలో కోదండ రాముని కళ్యాణం..

* ప్రకాశం : గిద్దలూరు మండలం పొదలకుంటపల్లెలో రాష్ట్ర స్థాయి ఎద్దుల బండ లాగుడు పోటీలు..

* తిరుమల: ఇవాళ శ్రీవారి ఆలయంలో శ్రీరామ నవమి ఆస్థానం.. సాయంత్రం హనుమంత వాహనంపై భక్తులకు దర్శనం ఇవనున్న శ్రీవారు.. ఇవాళ సహస్రదీపాలంకరణ సేవను రద్దు చేసిన టిటిడి.. రేపు శ్రీవారి ఆలయంలో శ్రీరామ పట్టాభిషేకం

* రాజన్నసిరిసిల్ల జిల్లా: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో నేడు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం.. స్వామివారి కళ్యాణానికి వేలాదిగా తరలివచ్చిన భక్తులు, ఆలయ వెనుక భాగంలో స్వామివారి దివ్య కళ్యాణం

* ప్రకాశం : దోర్నాల రామాలయంలో ఏర్పాటు చేసిన సీతారాముల కళ్యాణంలో పాల్గొననున్న పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్

* ప్రకాశం : గిద్దలూరులో శ్రీరామనవమి సందర్భంగా 100 మంది రామభక్తులతో బైక్ ర్యాలీ..

* బాపట్ల : అద్దంకి మండలం సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణోత్సవం..

* నేడు గుంటూరులో శ్రీరామనవమి సందర్భంగా శోభాయాత్ర..

* నేటి నుంచి నాలుగు రోజులు పాటు గుంటూరు మిర్చి యార్డుకు సెలవులు..

* గుంటూరు: నేడు జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు తెనాలిలో గాడి భావి సెంటర్ నుండి గాంధీ చౌక్ వరకు చలువ పందిళ్లతో శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తున్న ఉత్సవ కమిటీ.

* తిరుపతి: చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల‌కు నేడు ధ్వజారోహణం…

* తిరుపతి: ఏప్రిల్‌ 3 నుండి 5వ తేదీ వరకు తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామీ తెప్పోత్సవాలు

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు రామ్ నగర్ లోని శబరి శ్రీరామ క్షేత్రంలో జరిగే శ్రీరామ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం తోటపల్లి గూడూరు మండలం కొత్తకోడూరులో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు.

* నెల్లూరు: శ్రీరామనవమి సందర్భంగా నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్ సాయి దర్బార్ అద్దాల మందిరంలో అఖండ సాయి నామ సంకీర్తన

* శ్రీరామనవమి సందర్భంగా నెల్లూరు నగరంలోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానంలో హనుమంత సేవ కార్యక్రమం.. రాపూర్ మండలం పెంచలకోనలోని శ్రీ పెంచల లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో క్షేత్రోత్సవం

* ఏలూరు: సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని జిల్లావ్యాప్తంగా రామాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు.. చిన్న భద్రాద్రిగా పేరుందిన ఈస్ట్ ఎడవల్లి రామాలయంలో శ్రీరామ నవమి ఏర్పాట్లు పూర్తి.

* పశ్చిమగోదావరి జిల్లా: నేడు ఉప్పులూరు లో మాజీ మంత్రి యర్రా నారాయణస్వామి అంత్యక్రియలు..

* కాకినాడ: నేడు అన్నవరంలో శ్రీరామ నవమి వేడుకలు.. రత్నగిరి క్షేత్రపాలకుడు గా శ్రీ సీతారామచంద్ర స్వామి.. పెళ్లి పెద్దలగా సత్యదేవుడు అనంతలక్ష్మి సత్యతిదేవి అమ్మవారు

* శ్రీ సత్యసాయి : చెన్నేకొత్తపల్లి మండలం శ్రీరామనవమి పండుగ సందర్భంగా న్యామద్దల గ్రామం లో మహేశ్వరి ఆలయంలో ఉట్ల పరుసు మహోత్సవం.

* అనంతపురం : గుంతకల్ మండలం కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామ నవమి సందర్భంగా ఆలయంలో సీతారాముల కల్యాణ మహోత్సవం.

* శ్రీ సత్య సాయి : హిందూపురంలోని సూగూరు ఆంజనేయస్వామి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు. ఉదయం కళ్యాణోత్సవం, రథోత్సవం. సాయంత్రం ఉట్ల పరుష, లంకా దహనం

* నంద్యాల: నేడు శ్రీశైలంలో శ్రీసీతారామచంద్రస్వామివార్ల కల్యాణోత్సవం.. లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ సంకల్పం శ్రీ సీతారాముల కల్యాణోత్సవం

* కర్నూలు: మంత్రాలయంలో శ్రీ రామనవమి సందర్భంగా శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో స్వామివారికి తులసి అర్చన, కనకాభిషేకం, బిల్లర్చన, పంచామృతభిషేకం వంటి విషేశ పూజలు.. శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో సీతారామ కళ్యాణోత్సవం…

* అనంతపురం : నగరంలో శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యములో శ్రీరామ శోభాయాత్ర, బైక్ ర్యాలీ.

* మచిలీపట్నంలో ఈరోజు శ్రీరామనవమి పండగ సందర్భంగా.. శ్రీరామ శోభయాత్ర… మచిలీపట్నం పురవీధుల్లో జైశ్రీరామ్ అంటూ 1000 మందితో బైక్ ర్యాలీ. భారీగా పాల్గొన్న రామ భక్తులు

* నంద్యాల: శ్రీరామనవమి సందర్భంగా మహానంది క్షేత్రంలో నేడు సీతా సమేత కోదండరామ స్వామి కళ్యాణమహోత్సవం .. సాయంత్రం గ్రామోత్సవము

Exit mobile version