NTV Telugu Site icon

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today New

Whats Today New

* నేడు దేశ రాజధాని ఢిల్లీలో రిపబ్లిక్ డే ఉత్సవాలు.. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు సాగనున్న రిపబ్లిక్ డే కార్యక్రమం.. ఉదయం 10.30 గంటలకు విజయ్ చౌక్ వద్ద ప్రారంభమై ఎర్రకోట వరకు సాగనున్న పరేడ్

* గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆర్మీకి చెందిన నాలుగు బృందాలు, వాయు సేన, నావీకి చెందిన ఒక్కొక్క బృందం కవాతు.. జాతీయ గీతం ఆలాపన సంధర్భంగా 21 గన్ సెల్యూట్స్ కోసం సాంప్రదాయంగా ఉపయోగించే పురాతన బ్రిటీష్ పౌండర్ గన్స్ కు బదులుగా 105ఎంఎం ఇండియన్ ఫీల్డ్ గన్స్ తో భర్తీ.. ఈజిప్టు నుంచి వచ్చిన 120 మంది సైనికులతో కూడిన పటాలం కవాతు

* కొత్తగా సైన్యంలో చేరిన అగ్నివీర్లతో కూడిన పటాలం కవాతు.. ఆర్మీ సిగ్నల్ కోర్, ఎయిర్ డిఫెన్స్ , ఆర్మీ డేర్ డెవిల్స్ విభాగాల నుండి మహిళా అధికారుల మార్చ్.. ఆకాశ్ క్షిపణుల విభాగానికి లెఫ్టినెంట్ చేతన్ శర్మ నేతృత్వం

* బీఎస్ఎఫ్ కేమెల్ కంటింజెంట్ లోని మహిళా బృందం కవాతు.. నారీశక్తి ప్రదర్శనలో భాగంగా నేవీలోని 144 సెయిలర్ విభాగానికి మహిళా అధికారిణులు నేతృత్వం .. 42 ఏళ్లుగా నౌకా దళానికి సేవలందిస్తున్న ఐఎల్-38 విమానం చివరిసారిగా రిపబ్లిక్ డే వేడుకల్లో హాజరు

* విజయవాడ: ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు.. పాల్గొననున్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్‌ జగన్.. జాతీయ జెండా ఆవిష్కరణ, సాయుధ దళాల గౌరవ వందనం, శకటాల ప్రదర్శన అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్న గవర్నర్

* నిర్మల్: బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు.. దర్శనం కోసం బారులు తీరిన భక్తులు.. కొనసాగుతున్న అక్షరాభ్యాసాలు ,అమ్మవారి దర్శనం.. భక్తులతో కిటకిట లాడుతున్న ఆలయం

* ప్రకాశం : మార్కాపురంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి ఆదిమూలపు సురేష్..

* శ్రీకాకుళం: గణతంత్ర వేడుకలకు సిద్దమైన ఆర్ట్స్ కళాశాల ప్రాంగణం.. జెండాను ఆవిష్కరించనున్న కలక్టర్ లాఠకర్..

* శ్రీకాకుళం: కాశీబుగ్గ రైల్వే కాలనీలోని సరస్వతీ దేవి ఆలయ ప్రాంగణంలో సామూహిక అక్షరాభ్యాసం. పెద్ద ఎత్తున‌కార్యక్రమంలో పాల్గొననున్న చిన్నారులు.

* నెల్లూరులోని పోలీస్ మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు పాల్గొన్న కలెక్టర్ చక్రధర్ బాబు ఇతర శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు..

* నెల్లూరు: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెంకటాచలంలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు

* శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ జెండాను ఆవిష్కరించనున్న షార్ట్ డైరెక్టర్ డాక్టర్ రాజరాజన్

* నంద్యాల: నేడు కొలను భారతీ ఆలయంలో వసంత పంచమ సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న శ్రీశైల దేవస్థానం వారు పాల్గొనున్న నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్…

* తిరుమల: ఎల్లుండి శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు.. సప్తవాహనాల పై భక్తులుకు దర్శనం ఇవ్వనున్న శ్రీవారు..

* తిరుమల: ఎల్లుండి సర్వదర్శనం భక్తులుకు టోకేన్లు జారి ,విఐపి బ్రేక్ ,ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ.. వైకుంఠం క్యూ కాంప్లేక్స్ నుంచి సర్వదర్శనం భక్తులును దర్శనానికి అనుమతించనున్న టిటిడి

* తిరుమల: రేపు,ఎల్లుండి ఆడ్వాన్స్ రిజర్వేషన్ లో వసతి గదులు కేటాయింపు రద్దు చేసిన టిటిడి.. రథసప్తమి రోజున భక్తులుకు పంపిణి చెయ్యడానికి 7.5 లక్షల నిల్వలు వుంచిన టిటిడి..గ్యాలరిలో వేచివున్న భక్తులుకు నిరంతరాయంగా అన్నప్రసాద సౌకర్యం కల్పించేలా ఏర్పాట్లు

* శ్రీ సత్య సాయి : నేడు హిందూపురంనియోజకవర్గంలో పర్యటించనున్న సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ..

* తిరుమల: రేపు ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లు ఆన్ లైన్ లో విడుదల చెయ్యనున్న టీటీడీ.. ఫిబ్రవరి నెలకు సంబంధించిన టికెట్లను కూడా ఆన్ లైన్ లో విడుదల చేయనున్న అధికారులు.. రోజుకి 750 చొప్పున టికెట్లు ఆన్‌లైన్‌లో పెట్టనున్న టీటీడీ.. ఆఫ్ లైన్ విధానంలో రోజుకి 250 చొప్పున టికెట్లు

* ఏలూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు.. జాతీయ జెండా ఆవిష్కరించనున్న జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్..

* తిరుమల: ఇవాళ శ్రీవారిని దర్శించుకోనున్న నారా లోకేష్.. దర్శనాంతరం కుప్పంకు బయల్దేరనున్న లోకేష్‌..

* తూర్పుగోదావరి జిల్లా : నేడు కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రివర్యులు దేవుసింహ్ చౌహాన్ రాజమండ్రిలో రెండోవరోజు పర్యటన.. బీజేపీ కార్యాలయం వద్ద రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ

* గుంటూరు: నేడు పెద కాకాని పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటుచేసిన దండి సత్యాగ్రహ విగ్రహాల ఆవిష్కరణ.. ముఖ్య అతిథులుగా పాల్గొననున్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు, తదితరులు

* గుంటూరు: నేడు గణతంత్ర దినోత్సవ సందర్భంగా గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ పతాక ఆవిష్కరణ.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న జిల్లా కలెక్టర్ వేణుగోపాల రెడ్డి…

* గుంటూరు : తెనాలి సుల్తానాబాద్ లో నూతనంగా నిర్మించిన వైయస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించనున్న ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని…