NTV Telugu Site icon

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today New

Whats Today New

* నేడు భారత్-న్యూజిలాండ్‌ మధ్య మూడో వన్డే.. ఇండోర్‌ వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం.. మరో క్లీన్ స్వీప్‌పై టీమిండియా కన్ను

* అమరావతి: జీవో నంబర్ 1 పై నేడు హైకోర్టులో కొనసాగనున్న విచారణ.. అదనపు పిటిషన్ దాఖలు చేసిన బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్‌ నేతలు.. అన్ని పిటిషన్లను నేడు విచారించనున్న ధర్మాసనం

* జగిత్యాల జిల్లా: నేడు కొండగట్టు, ధర్మపురి ఆలయాలను సందర్శించనున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌.. ధర్మపురి నుండి అనుష్ఠుస్ నారసింహయాత్ర ప్రారంభం.. తెలంగాణలో జనసేన పటిష్టానికి 32 నియోజకవర్గాలకు చెందిన నేతలతో సమీక్షలు.. ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరి ఉదయం 11 గంటలకి కొండగట్టు అంజన్న ఆలయంకి చేరుకొనున్న పవన్..

* ఉదయం 11 గంటలకు మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంకు చేరుకోనున్న పవన్ కల్యాణ్‌.. అంజన్న దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం వారాహి ప్రచార రథం కి పూజలు చేయిస్తారు..

* సాయంత్రం 3.30 నిమిషాలకు ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్న పవన్‌ కల్యాణ్‌.. ధర్మపురి నుండి అనుష్టుస్ నారసింగ యాత్ర గా 32 క్షేత్రాల సందర్శన యాత్ర ప్రారంభం.. సాయంత్రం 5.30 నిమిషాలకు తిరిగి హైదరాబాద్ పయనం కానున్న పవన్

* కర్ణాటక రాష్టంలో అసైన్డ్ భూములపై అమలవుతున్న విధి విధానాలను తెలుసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున బెంగళూరుకు వెళ్లిన మంత్రి ఆదిమూలపు సురేష్..

* కడప: రేపటి నుంచి 28 వరకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు..

* కాకినాడ: నేడు తునిలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనున్న మంత్రి దాడిశెట్టి రాజా

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరులో జరిగే రహదారి భద్రత వారోత్సవాల్లో పాల్గొంటారు అనంతరం పొదలకూరు మండలంలో పర్యటిస్తారు

* నెల్లూరులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా

* పశ్చిమ గోదావరి జిల్లా: భీమవరంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం.. హాజరుకానున్న కేంద్ర సహాయ మంత్రులు మురళీధరన్, భారతీ ప్రవీణ్ పవార్, రాష్ట్ర బీజేపీ సహ ఇంఛార్జి సునీల్ దేవధర్, రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు.. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి మీద రాజకీయ తీర్మానం, చర్చ..

* కర్నూలు: నేడు కోడుమూరులో బీజేపీ బూత్ కమిటీ శక్తి కేంద్రాల సమావేశం.. పాల్గొననున్న కేంద్ర మంత్రి దేవుసిన్హ చౌహాన్

* కర్నూలు: నేడు కోడుమూరు మండలం గోరంట్ల వద్ద హంద్రీనదిపై బ్రిడ్జి నిర్మాణానికి భూమి పూజ.. పాల్గొననున్న మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, గుమ్మనూరు జయరామ్

* అనంతపురం : జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా నగరంలోని అంబేద్కర్ భవన్‌ లో ముగింపు సభ.

* అనంతపురం: శెట్టూరు మండల పరిధిలోని బసంపల్లి గ్రామంలో చేపట్టనున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఉషశ్రీ చరణ్ .

* శ్రీకాకుళం: ఆముదాలవలస తిమ్మాపురం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం.. పాల్గొననున్న స్పీకర్ తమ్మినేని సీతారాం .

* శ్రీకాకుళం: పలాసలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం.. పాల్గొననున్న రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు

* నేడు సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి

* ఖమ్మం: నేటి నుండి ప్రారంభం కానున్న జేఈఈ మెయిన్స్ పరీక్షలు.. ఫిబ్రవరి 1 వరకు జరగనున్న మొదటి విడత పరీక్షలు.. పరీక్షా కేంద్రాలను పూర్తిగా శానిటైజ్ చేసి పటిష్ట పోలీసు బందోబస్తు ను ఏర్పాటు చేసిన అధికారులు..

* ఆదిలాబాద్: నేడు కేస్లాపూర్ లో నాగోబా ఆలయం వద్ద ప్రజా దర్బార్.. హాజరుకానున్న మంత్రులు సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డి.. జాతర, దర్బార్ సందర్భంగా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు హాలిడే ప్రకటించిన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.