Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today New

Whats Today New

* నేడు గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న కౌంటింగ్‌..

* గుజరాత్‌లో రెండు దశల్లో 182 అసెంబ్లీ స్థానాలకు జరిగిన పోలింగ్‌.. 64.33 శాతం పోలింగ్‌ నామోదు.. 37 కేంద్రాల్లో కౌంటింగ్‌, అన్ని పార్టీల నుంచి మొత్తం 1,621 మంది అభ్యర్థులు

* హిమాచల్‌ప్రదేశ్‌లో 68 స్థానాలకు ఓట్ల లెక్కింపు

* ప్రకాశం : పెద్దారవీడు మండలం దేవరాజుగాట్టు నుండి ప్రారంభం కానున్న ప్రభుత్వ విప్ కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గారెడ్డి పాదయాత్ర.. ఏపీ సీఎం జగన్ సుపరిపాలన అందించాలని కోరుతూ తిరుమల నుండి శ్రీశైలం వరకు పాదయాత్ర చేపట్టిన ఎమ్మెల్యే చిర్ల జగ్గారెడ్డి..

* తిరుమల: ఇవాళ పౌర్ణమి గరుడ వాహన సేవ.. రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి

* నేడు గుంటూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన.. మధ్యాహ్నం రెండు గంటలకు పొన్నూరు నియోజకవర్గం పెదకాకాని చేరుకొనున్న చంద్రబాబు, చేబ్రోలు మండలం నారాకోడూరు నుండి పొన్నూరు వరకు రోడ్ షో.. అనంతరం పొన్నూరులో బహిరంగ సభలో పాల్గొననున్న చంద్రబాబు.

* తూర్పుగోదావరి జిల్లా : నేడు, రేపు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ సిహెచ్. విజయ ప్రతాప్ రెడ్డి, పర్యటన.. క్షేత్ర స్థాయి తనిఖీలో భాగంగా రేషన్ షాపులు, మొబైల్ డిస్ట్రిబ్యూషన్ వాహనాలు, స్కూల్స్ లో మధ్యాహ్న భోజన పథకం అమలు, ఇతర సంక్షేమ పథకాలు అమలు తీరు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ల వసతి గృహల నిర్వహణను పరిశీలన

* గుంటూరు: నేడు తాడికొండ మేడికొండూరు మండలాల్లో పర్యటించనున్న భారతీయ ఉద్యాన పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు.. పొన్నెకల్లు ,రావెల, మందపాడు, సిరిపురం గ్రామాల్లో మిర్చి పంటను పరిశీలించనున్న శాస్త్రవేత్తలు..

* బాపట్ల జిల్లా: కొల్లూరు మండలం తోకలవారిపాలెంలో నేడు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి మేరుగ నాగర్జున.

* ఏలూరు జిల్లా: నేటి నుంచి మూడు రోజులపాటు జంగారెడ్డిగూడెంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు.. ముఖ్య అతిథిగా పాల్గొనున్న సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు, మాజీ ఎంపి బృందాకరత్..

* అనంతపురం : శెట్టూరు మండల పరిధిలోని అనుంపల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఉషశ్రీ చరణ్

* సత్యసాయి : మడకశిర మండలం భక్తరపల్లి శ్రీలక్ష్మీనరసంహస్వామి జిల్లేడుగుంట ఆంజనేయస్వామి వార్ల బ్రహ్మోత్సవాల్లో బాగంగా నేడు స్వామి వార్ల బ్రహ్మరథోత్సవం.

* అనంతపురం : పామిడి పట్టణంలో దత్తాత్రేయ జయంతి వేడుకలు.

* విశాఖ: నేడు రోస్ హిల్స్ అమలోద్భవిమాత కొండగుడి పండుగ.. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల నుంచి తరలి వస్తున్న భక్తులు. భారీగా పోలీసు బందోబస్తు… ఓల్డ్ టౌన్ లో ట్రాఫిక్ ఆంక్షలు

* కడప నగరంలోని 39 వ డివిజన్ లో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం

* విశాఖ: నేడు నగరానికి రానున్న మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు.. వారం రోజుల పాటు ఏపీ, తెలంగాణాలో పర్యటించనున్న గవర్నర్

* కాకినాడ: నేటి నుంచి అన్నవరం సత్యదేవుని ఆలయంలో స్టీల్ ప్లేట్ లలో అన్న ప్రసాదం.. అరిటాకాలు లభ్యత పూర్తిగా లేకపోవడం, వ్యయం పెరగడంతో ఈ నిర్ణయం.. స్టీల్ ప్లేట్ లను శుభ్రం చేయడానికి మిషన్లు సిద్ధం చేసిన అధికారులు

* కర్నూలు: నేడు తుగ్గలి మండలం జొన్నగిరిలో శ్రీ దస్తగిరి స్వామి ఉర్సు మహోత్సవం

Exit mobile version