NTV Telugu Site icon

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today New

Whats Today New

* నేడు భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య రెండో వన్డే.. ఢాకా వేదికగా ఉదయం 11.30 గంటలకు మ్యాచ్‌

* నేటి నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమవేశాలు.. 16 బిల్లులను ప్రవేశపెట్టెందేకు ప్రభుత్వం ప్రయత్నాలు

* నేడు జగిత్యాల జిల్లాలో సీఎం కేసీఆర్‌ పర్యటన.. నూతన కలెక్టరేట్‌ భవనాన్ని ప్రారంభించనున్న సీఎం.. టీఆర్ఎస్‌ జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం, భారీ బహిరంగసభలో పాల్గొననున్న తెలంగాణ సీఎం

* విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నేడు జయహో బీసీ మహాసభ.. బీసీ మంత్రులు, నేతులు, ప్రజాప్రతినిధులు సహా, 2 లక్షల మందికిపైగా హాజరవుతారని అంచనా.. సీఎం వైఎస్‌ జగన్‌ హాజరుకానున్నారు

* నేడు నెల్లూరుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. నెల్లూరు రూరల్ మండలం కనపర్తిపాడులో జరిగే సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కుమార్తె వివాహ మహోత్సవంలో పాల్గొననున్న జగన్, భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన అధికారులు

* నాగర్ కర్నూల్: నేడు అచ్చంపేటలో మాజీ మంత్రి జూపల్లి ఆత్మీయ సమ్మేళనం.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనుచరులకు పిలుపు, తెలంగాణ మలి దశ ఉద్యమ కారులు పేరిట వాట్సాప్‌ గ్రూప్.. వివిధ రంగాల్లో ఉండి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి ఫోన్ కాల్స్

* గుంటూరు: నేడు మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించనున్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. జనవరి 2న ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష.

* పల్నాడు: నేడు చిలకలూరిపేట 38వ వార్డులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న రాష్ట్ర మంత్రి విడదల రజిని…

* గుంటూరు: మెడికల్ విద్యార్థిని హత్య కేసులో నిందితుడు జ్ఞానేశ్వర్ ను అరెస్టు చేసిన పెదకాకాని పోలీసులు.. నేడు నిందితుడిని గుంటూరు కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు…

* గుంటూరులోని ప్రధాన పైప్ లైన్ లీకుల మరమ్మత్తుల కారణం గా గుంటూరులోని ప్రధాన ప్రాంతాలకు నీటి సరఫరా నిలిపివేయనున్న అధికారులు..

* గుంటూరు: రేపు పొన్నూరు నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన.. ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు.. నారాకోడూరు నుంచి పొన్నూరు వరకు రోడ్ షో లో పాల్గొననున్న చంద్రబాబు.

* బాపట్ల లో అత్యవసర మరమ్మతుల కారణంగా బాపట్లలోని అగ్నిమాపక కేంద్రం వద్ద ఉన్న రైల్వే గేట్ రేపటి వరకు మూసివేత

* ప్రకాశం : పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు కాశినాయన ఆశ్రమంలో 27వ ఆరాధన మహోత్సవాలు, భారీగా హాజరుకానున్న భక్తులు..

* తిరుమల: ఇవాళ శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవం.. సాయంత్రం సహస్రదీపాలంకరణ సేవను రద్దు చేసిన టీటీడీ, రేపు శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడ సేవ, రాత్రి 7 గంటలకు గరుడ వాహనం పై భక్తులుకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి

* కడప: రెండో రోజుకు చేరుకున్న దక్షిణ అజ్మీర్ అమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాలు.. నేడు గంధం కార్యక్రమం, పెద్ద ఎత్తున రానున్న పీరుల్లా సాహెబ్ భక్తులు

* సత్యసాయి : మడకశిర మండలం భక్తరపల్లి శ్రీలక్ష్మీనరసంహస్వామి,జిల్లేడుగుంట ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల్లో బాగంగా ఇవాళ స్వామి వారి కళ్యాణోత్సవం

* నేటితో నిర్మల్‌ జిల్లాలో ముగియనున్న బండి సంజయ్ యాత్ర.. జిల్లా లో 10వ రోజుకు చేరిన ప్రజా సంగ్రామ యాత్ర.. ఖానాపూర్, మస్కపూర్, సుర్జా పూర్ ,భాదన్ కుర్తి మీదుగా కోరుట్ల నియోజక వర్గం ఓబులా పూర్,మొగిలిపేట వరకూ సాగనున్న పాద యాత్ర.