* నేడు లోక్‌సభ స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం.. పార్లమెంట్ శీతాకాల సమావేశాల అజెండాపై చర్చ
* నేడు కడప అమీన్ పీర్ దర్గాను దర్శించనున్న సీఎం వైఎస్ జగన్.. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడప చేరుకుని నేరుగా దర్గా చేరుకోనున్న సీఎం.. రాయచోటి రోడ్డులోని మాధవి కన్వెన్షన్ లో జరిగే వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించనున్న జగన్.. మధ్యాహ్నం 1.30కి కడప ఎయిర్ పోర్టు నుంచి గన్నవరం బయల్దేరనున్న సీఎం జగన్.
* నిర్మల్: 9వ రోజుకు చేరుకున్న బండి సంజయ్ పాదయాత్ర, ఇవాళ దిమ్మదుర్తి నుంచి ప్రారంభం కానున్న పాదయాత్ర.. రాజూరగేట్ మీదుగా ఖానాపూర్ చేరుకోనున్న బండి
* ఏపీ: నేడు ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు.. సాయంత్రం 4 గంటలకు సీపీఎస్‌పై ఉద్యోగ సంఘాలతో చర్చలు
* ప్రకాశం : త్రిపురాంతకం మండలం నడిగడ్డలో గండి పడిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ప్రాంతాన్ని పరిశీలించనున్న మంత్రి ఆదిమూలపు సురేష్..
* ప్రకాశం : ఒంగోలు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో 60వ హోంగార్డు వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా హాంగార్డుల కవాతు కార్యక్రమం, హాజరుకానున్న ఎస్పీ మలిక గర్గ్..
* ప్రకాశం : బేస్తవారిపేటకు చేరుకోనున్న అంబేద్కర్ జిల్లా, ప్రభుత్వ విప్ కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గారెడ్డి పాదయాత్ర.. ఏపీ సీఎం జగన్ సుపరిపాలన అందించాలని కోరుతూ తిరుమల నుండి శ్రీశైలం వరకు పాదయాత్ర చేపట్టిన ఎమ్మెల్యే చిర్ల జగ్గారెడ్డి..
* అనంతపురం : శెట్టూరు మండలo లింగదీర్లపల్లి గ్రామoలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఉషశ్రీ చరణ్
* సత్యసాయి : మడకశిరలోని భక్తరపల్లి లక్ష్మీనరసింహస్వామి, జిల్లేడుగుంట ఆంజనేయ స్వామి దేవాలయాల్లో నేటి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.
* కడప: రేపటి నుంచి మూడు రోజుల పాటు కాశినాయన మండలం జ్యోతి క్షేత్రంలోని అవధూత కాసినాయన రెడ్డి ఆరోధనోత్సవాలు
* అనంతపురం : ఉరవకొండలో నేటి నుంచి అంతర్ కళాశాల క్రీడాపోటీలు ప్రారంభం.
* అనంత క్రీడా గ్రామంలో నేటి నుంచి రెండు రోజుల పాటు జాతీయస్థాయి కర్రసాము పోటీలు.
* కాకినాడ: నేడు తునిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి రాజా
