Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today New

Whats Today New

* నేడు ఢిల్లీలో జీ-20 సన్నాహక సమావేశం, ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశం, హాజరుకానున్న అన్ని రాష్ట్రాల సీఎంలు, రాజకీయ పార్టీల అధ్యక్షులు

* నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉదయం 11.35 గంటలకు గో మందిరం( అలిపిరి) సందర్శన, మధ్యాహ్నం 12.50 గంటలకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం, మధ్యాహ్నం 1.40 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుండి డిల్లీ తిరుగుప్రయాణం .

* నేడు ఢిల్లీకి ఏపీ సీఎం వైఎస్‌ జగన్.. ప్రధాని అధ్యక్షతన జరిగే జీ-20 సన్నాహక సమావేశంలో పాల్గొననున్న సీఎం

* ఇవాళ దక్షిణ అండమాన్‌ సముద్రంలో అల్పపీడనం, ఈ నెల 8న తమిళనాడు, పుదుచ్చేరి దగ్గర తీరం దాటే అవకాశం, అల్పపీడనం ప్రభావంతో ఏపీకి వర్ష సూచన, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు పడే అవకాశం-ఐఎండీ

* నేడు తెలంగాణ వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో పీసీసీ ధర్నాలు, రైతు సమస్యలపై ధర్నాలకు పిలుపునిచ్చిన కాంగ్రెస్‌

* నేడు ఢిల్లీకి టీడీపీ అధినేత చంద్రబాబు.. జీ20 సదస్సు నిర్వహణపై రాష్ట్రపతి భవన్ లో ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగే సన్నాహక సమావేశానికి హాజరుకానున్న చంద్రబాబు

* ఖమ్మం మార్కెట్ లో నేటి నుండి పత్తి కొనుగోళ్లు ప్రారంభం, జీఎస్టీ సమస్య కారణంగా వారంరోజులుగా నిలిచిపోయిన కొనుగోళ్లు, జీఎస్టీ సమస్యను మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకుపోయిన పత్తి వ్యాపారులు

* నేడు సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన.. సిద్దిపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి హరీష్ రావు

* విశాఖ: నేడు జీవీఎంసీ దగ్గర భారత గిరిజన ఉద్యోగుల సంఘం నిరసన. బోయ సహా ఇతర ఏ కులలాలను ఎస్.టీ జాబితాలో చేర్చవద్దని డిమాండ్.. జీవో నెంబర్ 52రద్దు చెయ్యాలని పట్టుబడుతున్న గిరిజన సంఘాలు

* గుంటూరు: ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో నేటితో ముగియనున్న వ్యవసాయ సాంకేతికత 2022 సదస్సు.

* ప్రకాశం : కొమరోలు మండలం తాటిచెర్ల మోటు వద్దకు చేరుకోనున్న ప్రభుత్వ విప్ కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గారెడ్డి పాదయాత్ర.. ఏపీ సీఎం జగన్ సుపరిపాలన అందించాలని కోరుతూ తిరుమల నుండి శ్రీశైలం వరకు పాదయాత్ర చేపట్టిన ఎమ్మెల్యే చిర్ల జగ్గారెడ్డి.

* అనంతపురం : శెట్టూరు మండలo బొచ్చుపల్లి గ్రామoలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఉషశ్రీ చరణ్

* అనంతపురం : యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి జిల్లా స్థాయి యువజనోత్సవాలు.

* సత్యసాయి : మడకశిరలోని భక్తరపల్లి లక్ష్మీనరసింహస్వామి,జిల్లేడుగుంట ఆంజనేయ స్వామి దేవాలయాల్లో ఈనెల 6 నుంచి బ్రహ్మోత్సవాలు. 9 న భూతప్పలు , జ్యోతుల ఉత్సవం.

* అనంతపురం : జగనన్న క్రీడా సంబరాలలో భాగంగా రేపటి నుంచి జోనల్ స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు.

* కర్నూలు: నేడు రాయలసీమ గర్జన సభ, మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ మద్దతుతో జేఏసీ ఆధ్వర్యంలో సభ, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్, గర్జన సభకు లక్ష మంది హాజరవుతారని అంచనా, పాల్గొననున్న రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రజాప్రతినిధులు, 30 మంది ఎమ్మెల్యేలు, 10 మంది మంత్రులు పాల్గొనే అవకాశం

* కర్నూలు: ఎస్టీబీసీ కళాశాల మైదానంలో రాయలసీమ గర్జన సభ, రాయలసీమ గర్జన సభ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు, ఉదయం నుంచి సభ ముగిసే వరకు వాహనాలను దారి మళ్లింపు.. కర్నూలు మెడికల్ కాలేజి, సుంకేసుల రోడ్డు సైంట్ జోసెఫ్ కాలేజీ మైదానం, ఎగ్జిబిషన్ గ్రౌండ్, మున్సిపల్ హైస్కూల్ మైదానంలో వాహనాల పార్కింగ్

* నంద్యాల: బనగానపల్లె (మం) యాగంటి ఉమా మహేశ్వర స్వామి క్షేత్రం లో నేడు విశేష అభిషేక ప్రత్యేక పూజలు, బిల్వార్చన, స్వామి అమ్మవార్లకు మహా మంగళహారతి, సమర్పించనున్న ఆలయ అర్చకులు.

Exit mobile version