Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today New

Whats Today New

* హైదరాబాద్: నేడు మహాప్రస్థానంలో కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు.. ఉదయం 11 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో కైకాల అంత్యక్రియలు

* కడప జిల్లాలో నేడు రెండో రోజు సీఎం జగన్‌ పర్యటన.. మధ్యాహ్నం వరకు ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొననున్న సీఎం.. వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి, ప్రత్యేక ప్రార్థనలు చేయనున్న సీఎం.. మధ్యాహ్నం పులివెందులలో ఆర్టీసీ బస్టాండ్ తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్న జగన్..

* పశ్చిమ గోదావరి జిల్లా: భీమవరంలో నేడు కేంద్ర మంత్రి మురళిధరన్ పర్యటన.. భీమవరం, తాడేపల్లిగూడెం రోడ్ లో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి హాజరుకానున్న కేంద్ర మంత్రి

* ఫిలింనగర్ లోని ఆయన నివాసం నుంచి మహాప్రస్థానం వరకు కొనసాగనున్న కైకాల సత్యనారాయణ అంతిమయాత్ర..

* చెన్నై: కరోనా వైరస్ పై కేంద్రం హెచ్చరికల ననేపథ్యంలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించడానికి సిద్ధమైన తమిళనాడు ప్రభుత్వం.. నేడు వేడుకలపై వైద్య శాఖ, పోలీసు శాఖ ఉన్నాదికారుల సమావేశం.. ఆ తర్వాత వేడుకలపై నిర్ణయం

* భద్రాద్రి: నేడు భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో ముక్కోటి ఉత్సవాలలో భాగంగా రెండో రోజు కూర్మావతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న సీతారామ చంద్రస్వామి

* ప్రకాశం : పీసీ పల్లి చేరుకొనున్న సినీ నటుడు సాయి చంద్ పాదయాత్ర.. పొట్టి శ్రీరాములు త్యాగానికి సంఘీభావంగా చెన్నై లోని పొట్టి శ్రీరాములు స్మారక భవనం నుండి ఆయన సొంత గ్రామం జిల్లా లోని పీసీ పల్లి మండలం పడమటిపల్లె గ్రామం వరకు పాదయాత్ర మొదలుపెట్టిన సినీ నటుడు సాయి చంద్.. పీసీ పల్లి మండలం పడమటిపల్లెలో పాదయాత్ర ముగింపు సభ..

* ఒంగోలులో ప్రారంభంకానున్న 25వ జాతీయ తైక్వాండో పోటీలు, హాజరుకానున్న 10 రాష్ట్రాలకు చెందిన 350 మంది విద్యార్ధులు..

* గుంటూరు: నేడు తెనాలిలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు.. హాజరుకానున్న మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, నటులు మురళీమోహన్, జయచిత్రలకు ఎన్టీఆర్ పురస్కారాలను ప్రదానం చేయనున్న వెంకయ్య నాయుడు…

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముత్తుకూరు.. వెంకటాచలం మండలాల్లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు

* తిరుమల: .ఇవాళ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చెయ్యనున్న టీటీడీ.. జనవరి 1 మరియు వైకుంఠ ద్వార దర్శనానికి సంభందించి జనవరి 2 నుంచి 11 వ తేది వరకు సంబంధించిన టికెట్లు రోజుకి 20 వేల చొప్పున 2.2 లక్షల టికెట్లు విడుదల చెయ్యనున్న టీటీడీ

* తూర్పుగోదావరి జిల్లా : నేడు రాజమండ్రి గోదావరి పుష్కర్ ఘాట్ వద్ద LB మరియు జడ్జి బంగ్లా ట్యాంక్స్ నింపే పైపలైన్ డామేజ్ అయినందున మంచినీటి సరఫరా బంద్

* తిరుపతి: నేడు నగరంలో కేంద్రం విద్యుత్ శాఖ మంత్రి ఆర్ కే సింగ్ పర్యటన

* నిజమాబాద్ : నేడు జిల్లాలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటన.. వేల్పుర్, భీంగల్, కమ్మర్ పల్లి లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి

Exit mobile version