* నేటితో ముగియనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
* నేడు స్వర్గీయ మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు వర్థంతి.. పీవీ జ్ఞానభూమి దగ్గర నివాళులర్పించనున్న ప్రముఖులు
* కడప: నేటి నుంచి మూడురోజుల పాటు జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్న సీఎం, నగరంలో పలు ప్రైవేట్ కార్యక్రమాలకు హాజరు.. మధ్యాహ్నం కమలాపురం నియోజకవర్గంలో పర్యటన.. రు.900 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం.. భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన అధికారులు
* తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలకు బీఆర్ఎస్ పిలుపు.. ఉపాధి హామీ నిధులను కేంద్రం వెనక్కి అడగడంతో జిల్లా కేంద్రాల్లో రైతులతో ధర్నాలు
* భద్రాద్రి: నేడు మణుగూరులో సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వెడుకలు.. 133 వసంతాలు పూర్తి చేసుకొని నేటి నుండి 134 సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సింగరేణి.
* నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే రైతుల మహాధర్నాకు హాజరు కానున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు
* ప్రకాశం : ఒంగోలులోని రాజా పానగల్ రోడ్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి..
* నెల్లూరు : కందుకూరు చేరుకున్న సినీ నటుడు సాయిచంద్ పాదయాత్ర.. కందుకూరు బండ్లమిట్ట సెంటర్ లోని పొట్టి శ్రీరాములు బొమ్మకి నివాళులర్పించి తిరిగి పాదయాత్రను ప్రారంభించనున్న సాయి చంద్..
* గుంటూరు: రేపు తెనాలిలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు, ముఖ్యఅతిథిగా హాజరుకానున్న మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు….
* తిరుమల: ఇవాళ ఉదయం 9 గంటలకు టీటీడీ ఈవోగా భాధ్యతలు స్వీకరించనున్న దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరి అనిల్ కుమార్ సింఘాల్.. కుమారుడి మరణంతో 12 రోజులు పాటు సెలవులో వెళ్లిన ప్రస్తుత ఈవో ధర్మారెడ్డి
* అల్లూరి సీతారామరాజు జిల్లా: అరకులోయలో 11డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదు
* పల్నాడు: నేడు చిలకలూరిపేట మార్కెట్ యార్డులో, స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో జాబ్ మేళా…
* అనంతపురం : కుందుర్పి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ట్యాబ్ లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఉషశ్రీ చరణ్.. ఈస్ట్ కోడిపల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఉషశ్రీ చరణ్
* పశ్చిమగోదావరి: తాడేపల్లిగూడెంలో విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేయనున్న మంత్రి కొట్టు సత్యనారాయణ…
* విశాఖ: నేడు పెందుర్తి నియోజకవర్గంలో వైద్య శాఖ మంత్రి విడదల రజినీ పర్యటన…. ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభించనున్న ఇన్ఛార్జ్ మంత్రి
* అనంతపురం : నేటి నుంచి మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్న సమాచార కమీషనర్ .
* సత్య సాయి: పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో మాస్క్ తప్పని సరి చేసిన ట్రస్ట్.. పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా ప్రశాంతి నిలయంకు వచ్చే భక్తులు మాస్క్ తప్పని సరి. రేపటి నుంచి అమలు.. మాస్క్ ధరించాలని ఒక ప్రకటనలో తెలిపిన సత్యసాయి ట్రస్ట్ వర్గాలు.