Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today New

Whats Today New

* హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నేడు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్‌ విందు.. పాల్గొననున్న సీఎం కేసీఆర్, ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయన్న అధికారులు

* నేడు బాపట్ల జిల్లా యడ్లపల్లిలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన.. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీని ప్రారంభించనున్న సీఎం.. 4.59 లక్షల మంది విద్యార్థులు, 59,176 మంది ఉపాధ్యాయులకు ట్యాబ్‌లు పంపిణీని చేయనున్న ప్రభుత్వం

* మాచర్ల ఘటనపై ఇవాళ ఉదయం 11.30 గంటలకు గవర్నరును కలవనున్న టీడీపీ బృందం.. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు నేతృత్వంలో గవర్నర్‌ దగ్గరకు టీడీపీ టీమ్‌.. మాచర్ల లో జరిగిన ఘటనకు సంబంధించి వీడియో ఫుటేజ్, వైసీపీ నేతలు దాడికి ముందు మారణయుధాలు పట్టుకుని తిరిగిన ఫొటోలను గవర్నరుకు అందచేయనున్న టీడీపీ బృందం.

* ఇవాళ ఏపీ సెక్రటేరీయేట్ అసోసియేషన్ ఎన్నికలు.. తొమ్మిది పోస్టులకు 30 మంది పోటీ.. అధ్యక్ష స్థానానికి పోటీ పడుతోన్న ప్రస్తుత అధ్యక్షుడు వెంకట్రామి రెడ్డి, యూత్, టూరిజం డిపార్ట్మెంట్ సెక్షన్ ఆఫీసర్ రామకృష్ణ.. ప్యానెళ్లు లేకుండా విడివిడిగా అసోసియేషన్ ఎన్నికలు.. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నాం 3 గంటల వరకు పోలింగ్.. పోలింగ్ అనంతరం కౌంటింగ్

* పశ్చిమ గోదావరి జిల్లా: లోక్ సభ ప్రవస్ యోజన కార్యక్రమంలో భాగంగా భీమవరంలో పర్యటించనున్న కేంద్ర మంత్రి వి.మురళి ధరన్.. భీమవరం టౌన్ లో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి ఓపెనింగ్ తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్న కేంద్ర మంత్రి..

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి.. చెమ్మడుగుంటలో జరిగే ముఖ్యమంత్రి వైయస్ జగన్ జన్మదిన వేడుకల్లో పాల్గొంటారు.. కావలిలో జరిగే క్రీడా సంబరాలను ప్రారంభించిన తర్వాత ముత్తుకూరు మండలంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు

* విశాఖ: సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా నియజకవర్గల్లో వేడుకలు… రక్తదాన శిబిరాలు ఏర్పాటు.. అనకాపల్లిలో బ్లడ్ డోనేట్ చెయ్యనున్న మంత్రి అమర్నాథ్

* క‌డ‌ప‌: నేడు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున సీఎం వైఎస్ జ‌గ‌న్ జ‌న్మదిన వేడుక‌లు.. క‌డ‌ప వైఎస్ ఆర్ విగ్రహం వ‌ద్ద జ‌రిగే కార్యక్రమాల్లో పాల్గొనున్న డిఫ్యూటీ సీఎం అంజ‌ద్ బాష‌

* క‌డ‌ప : నేటి నుంచి జిల్లాలో విద్యార్దుల‌కు డిజిట‌ల్ పాఠాలు.. 19,148 మంది విద్యార్దుల‌కు ట్యాబ్‌లు పంపిణీ చేయ‌నున్న అధికారులు

* తిరుపతి: జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున సీఎం వైఎస్ జ‌గ‌న్ జ‌న్మదిన వేడుక‌లు.. నగరి లో పొటాపోటిగా వేడుకలు సిద్ధమైన మంత్రి రోజా..

* అనంతపురం : కళ్యాణదుర్గం మండల పరిధిలోని మల్లిపల్లి గ్రామంలో నేడు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఉషశ్రీ చరణ్.. కరణం చిక్కప్ప హైస్కూల్ లో విద్యార్ధులకు ప్రభుత్వం ఉచితంగా అందించే కంప్యూటర్ ట్యాబ్ లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఉషశ్రీ చరణ్

* తూర్పుగోదావరి జిల్లా : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కడియంలో సైకతశిల్పం ఏర్పాటు.. అబ్బురపరుస్తున్న ఒడిశా సైకత శిల్పులు చెక్కిన భారీ ఇసుక ఇసుక చిత్రం

* విజయనగరం: భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో నేడు ఉత్తరాంధ్ర జోనల్ పదాధికారుల సమావేశం.. సమావేశంలో పాల్గోనున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజుగారు, జాతీయ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ కో-ఇంచార్జ్ సునీల్ దీయోదర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి PVN మాధవ్…

* అంబేద్కర్ కోనసీమ: నేడు రామచంద్రపురంలో టిడ్కో ఇళ్లు ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రులు ఆదిమూలపు సురేష్, చెల్లుబోయిన వేణు

* నేడు ఖమ్మంలో చంద్రబాబు భారీ బహిరంగసభ.. సాయంత్రం 4 గంటలకు సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో ప్రారంభం

* నేడు రెండు జిల్లా ల్లో కేసీఅర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ.. ఆదిలాబాద్ లో గర్భిణీ లకు పంపిణి చేయనున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.. కొమురం భీం జిల్లా లో కిట్ల ను పంపిణి లో పాల్గొననున్న బాల్క సుమన్.

Exit mobile version