NTV Telugu Site icon

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today New

Whats Today New

* ఢిల్లీ: నేడు సాయంత్రం 5 గంటలకు ఓబీసీ ఎంపీల సమావేశం.. బీసీల జనగణన, ఓబీసీ రిజర్వేషన్‌ 52 శాతానికి పెంపుపై చర్చ, ఓబీసీలకు క్రిమిలేయర్‌ ఎత్తివేయాలనే అంశాలపై చర్చించనున్న ఎంపీలు

* నేడు హైదరాబాద్‌కు పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌.. తాజ్‌కృష్ణ ఇన్వెస్ట్‌మెంట్‌ మీట్‌లో పాల్గొననున్న మాన్.. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో లంచ్‌మీట్‌లో పాల్గొననున్న పంజాబ్‌ సీఎం

* ఇవాళ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకాశం జిల్లా దర్శి పర్యటన.. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ తనయుడి వివాహ రిసెప్షన్‌కు హాజరుకానున్న సీఎం.. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు దర్శి చేరుకోనున్న సీఎం .. ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ తనయుడి వివాహ రిసెప్షన్‌కు హాజరుకానున్న సీఎం, అనంతరం 12 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1 గంటకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్న సీఎం జగన్

* ఇవాళ సాయంత్రం సీఎం వైఎస్‌ జగన్‌ విజయవాడ పర్యటన.. క్రిస్మస్‌ సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తేనీటి విందు కార్యక్రమానికి హాజరుకానున్న సీఎం, సాయంత్రం 5.20 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం. 5.30 గంటలకు విజయవాడ ఏ ప్లస్‌ కన్వెన్షన్‌కు చేరుకోనున్న సీఎం. క్రిస్మస్‌ సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తేనీటి విందు కార్యక్రమానికి హాజరుకానున్న సీఎం, సాయంత్రం 6 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకోనున్న సీఎం జగన్

* హైదరాబాద్‌: నేడు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ముందుకు మరోసారి ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి..

* రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గములో నేడు మంత్రి కేటీఆర్ పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలలలో పాల్గొననున్న కేటీఆర్

* హైదరాబాద్‌: ఇవాళ సాయంత్రం తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్ల సమావేశం

* ఢిల్లీలో నేడు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

* బాపట్ల : చీరాల కోదండరామస్వామి ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని 125 బంగారు పుష్పాలతో సువర్ణ పుష్పార్చన..

* గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కొనసాగుతున్న జాతీయస్థాయి గిరిజన విద్యార్థుల క్రీడలు… ఈనెల 22 వరకు జరగనున్న పోటీలు…

* గుంటూరు: ఈనెల 21న సీఎం జగన్ జన్మదిన వేడుకలు సందర్భంగా నేడు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమాలలో పాల్గొననున్న వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు…

* విశాఖ: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రెండో రోజు పర్యటన… అవంతి విద్యాసం స్థల్లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గో నున్న వెంకయ్యనాయుడు

* తూర్పుగోదావరి జిల్లా : నేటితో ముగియనున్న కొవ్వూరు సంస్కృత పాఠశాల ఆవరణలోని కంచికామకోటి 70వ పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి దశ సహస్ర భగవద్గీత పారాయణం, వేలాదిగా తరలివస్తున్న భక్తులు

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి టి.పి. గూడూరు..ముత్తుకూరు మండలాలలోని పలు గ్రామాల్లో పర్యటిస్తారు

* శ్రీకాకుళం రూరల్ మండలం, కళ్లెపల్లి గ్రామంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం. పాల్గొననున్న మంత్రి ధర్మాన‌ ప్రసాదరావు.

* అనకాపల్లి జిల్లా కె కోటపాడు మం” దాలివలస గ్రామంలో గడపగడప మన ప్రభుత్వం కార్యక్రమం లో పాల్గోన్ననున్న ఉప ముఖ్యమంత్రి బూడి.ముత్యాలనాయుడు