Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* నేడు మునుగోడులో టీఆర్ఎస్ ప్రజా దీవెన సభ, పాల్గొననున్న సీఎం కేసీఆర్, మధ్యాహ్నం భారీ కార్ల ర్యాలీతో హైదరాబాద్ నుంచి మునుగోడుకు కేసీఆర్

* హరారే: నేడు భారత్‌ – జింబాబ్వే రెండో వన్డే, ఇప్పటికే 3 వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో టీమిండియా

* హైదరాబాద్‌: మునావర్‌ ఫారూఖీ కామెడీ షోకు పోలీసుల అనుమతి, నేడు హైటెక్స్‌లో మునావర్‌ కామెడీ షో,

* ఇవాళ మునుగోడు నియోజక వర్గం నారాయణపురం పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి పర్యటన.. పొర్లగూడ తండాలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొని.. పార్టీ జెండా ఇంటింటి ప్రచారం చేయనున్న రేవంత్

* విజయవాడ: నేడు ఉదయం 9 గంటలకు విజయవాడ సిటీ సివిల్‌ కోర్ట్స్‌ సముదాయం ప్రారంభం, సిటీ సివిల్‌ కోర్ట్స్‌ సముదాయం ప్రారంభించనున్న సీజేఐ

* ప్రకాశం : చీమకుర్తిలో సీఎం వైఎస్ జగన్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించనున్న జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి..

* ప్రకాశం : మార్కాపురం శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో నాలుగు ప్రాకార గోపుర నిర్మాణాలకు భూమిపూజ కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే కేపీ.నాగార్జునరెడ్డి.

* ప్రకాశం : కనిగిరి మున్సిపాలిటీ లోని 9వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్

* ప్రకాశం : ఒంగోలు 9వ డివిజన్ లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మాజీమంత్రి, వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి..

* గుంటూరు జిల్లా: నేడు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రధానం… కార్యక్రమంలో పాల్గొనున్న గవర్నర్ బిశ్వబూషన్ హరిచందన్

* గుంటూరు: నేడు గుజ్జనగుండ్లలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా

* ఏలూరు జిల్లా: చింతలపూడి మండలం వూటసముద్రం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనున్న ఎమ్మెల్యే ఎలిజా..

* పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో గడపగడపకు కార్యక్రమంలో పాల్గొనున్న డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ..

* నెల్లూరు: కలెక్టరేట్‌లో జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం, తహసీల్దార్ కార్యాలయాల్లో చుక్కల భూముల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక సదస్సులు

* నెల్లూరు: సంగంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో గడప గడప కూ ప్రభుత్వం కార్యక్రమం

* నెల్లూరు: కొడవలూరు మండలం రామన్నపాలెంలో ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమం

* నెల్లూరు: కావలి రూరల్ మండలంలో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో గడప గడప కూ ప్రభుత్వం కార్యక్రమం

* నెల్లూరు: ఉదయగిరిలో వైసీపీ మండల నేతలతో ఎం.ఎల్.ఏ.చంద్ర శేఖర్ రెడ్డి సమావేశం

* కడప: నేడు కడప జిల్లా సిద్ధవటంలో జరిగే కౌలు రైతు భరోసా యాత్రలో పాల్గొన్న జన సేన అధినేత పవన్ కళ్యాణ్… ఆత్మహత్య చేసుకున్న బాధిత కుటుంబాలకు లక్ష చొప్పున ఆర్థిక సాయాన్ని అందించనున్న పవన్

* శ్రీ సత్య సాయి జిల్లా : బ్రాహ్మణ సంక్షేమ దినోత్సవం సందర్భంగా హిందూపురంలోని ఎమ్మెల్యే బాలకృష్ణ స్వగృహంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్ర పటానికి పాలాభిషేక కార్యక్రమం.

* అనంతపురం : నార్పల మండలం కురగానపల్లి లో గడప గడపకు మన ప్రభుత్వంలో పాల్గొననున్న ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి

* విజయనగరంలో నేడు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పర్యటన.. సాయంత్రం విశాఖ నుంచి జిల్లాకు చేరుకొని ఒక వివాహ కార్యక్రమానికి హాజరుకానున్న శ్రీనివాస్‌గౌడ్‌

* పార్వతీపురం మన్యం జిల్లా: నేడు గరుగుబిల్లి మండలం రాయివలస గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించనున్న కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి.

* తిరుమల: ఇవాళ శ్రీవారి ఆలయంలో ఉట్లోత్సవం.. ఈ సందర్భంగా ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు రద్దు చేసిన టీటీడీ

* తిరుపతి: నేడు పద్మావారి ఆలయంలోని శ్రీకృష్ణస్వామీ వారి ఉట్లోత్సవం.

* కాకినాడ: జేఎన్టీయూకే ఏర్పాటు చేసి14 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా నేడు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, హాజరుకానున్న ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్ర రెడ్డి

Exit mobile version