* నేడు అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్ పర్యటన. అచ్యుతాపురంలో ఏటీజీ టైర్ల ఫ్యాక్టరీని ప్రారంభించనున్న సీఎం జగన్.
* నేటి నుంచి ఐదు రోజుల పాటు నెల్లారులో శ్రీవారి వైభవోత్సవాలు.
* నేడు స్వాత్రంత్ర్య భారత వజ్రోత్సవాల్లో కీలక ఘట్టం. నేడు తెలంగాణ వ్యాప్తంగా సామూహిక జాతీయగీతాలాపన. రాష్ట్రమంతా ఒకే సమయంలో జాతీయగీతం పాడేలా ఏర్పాట్లు. అబిడ్స్ పోస్టాఫీస్ దగ్గర పొల్గొన్ననున్న సీఎం కేసీఆర్. ఉదయం 11.30 గంటలకు కార్యక్రమం.. అన్ని ట్రాఫిక్ కూడళ్లో నిమిషం పాటు రెడ్ సిగ్నల్.
* నేడు ఖమ్మంలో తమ్మినేని కృష్ణయ్య అంత్యక్రియలు. తెల్దారుపల్లిలో భారీ పోలీసు బందోబస్తు.
* భద్రాచలం దగ్గర మళ్లీ పెరుగుతున్న గోదావరి ఉధృతి. భద్రాచలం దగ్గర 49.10 అడుగులకు చేరిన నీటిమట్టం.
* నేడు బీహార్ కేబినెట్ మంత్రులు ప్రమాణస్వీకారం చేసే అవకాశం, ఆర్జేడ నుంచి 16 మంది, జేడీయూ నుంచి 13 మంది, కాంగ్రెస్ నుంచి ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం
* నేడు భద్రాచలం సందర్శించనున్న మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యం లో సీఎల్పీ బృందం పర్యటన… వరదల వల్ల దెబ్బ తిన్న ప్రాంతాల్లో పర్యటించనున్న సీఎల్పీ బృందం
* ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ఉయ్యాలవాడలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే అన్నా రాంబాబు..
* చీరాల పాపరాజుతోట రామస్తంభంలో శ్రావణమాసం నాలుగో మంగళవారం సందర్భంగా విశేష పూజలు, కుంకుమ పూజలు..
* ప్రకాశం: ముండ్లమూరు మండలం పోలవరంలో గడప గడపకు మన ప్రభుత్వము కార్యక్రమంలో పాల్గొననున్న దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్..
* విశాఖలో పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి మురళీధరన్ మూడు రోజుల పర్యటన.
* నెల్లూరు రూరల్ పరిధిలోని ఇస్కాన్ సిటీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
* నెల్లూరు: ఇందుకూరుపేట మండలం ముదివర్తివారి పాలెం లో ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమం
* నెల్లూరు: గూడూరు రూరల్ లో ఎమ్మెల్యే వరప్రసాద్ ఆధ్వర్యంలో గడప గడప కూ ప్రభుత్వం కార్యక్రమం
* తూర్పు గోదావరి జిల్లా: నేడు ఎమ్మేల్సీ. అనంతబాబు. బెయిల్ పిటిషన్ పై రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో విచారణ
* అనంతపురం : తాడిపత్రిలోని మూడవ వార్డు గాజులపాలెం, రూరల్ పరిధిలోని చిన్న పడమల గ్రామంలో గడపగడపకి మన ప్రభుత్వం పాల్గొననున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.
* కాకినాడ: నేడు జెడ్పీ ఛైర్మన్ అధ్యక్షతన జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం, హాజరుకానున్న ఉమ్మడి జిల్లాకి చెందిన మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు
* కర్నూలు: నేడు పత్తికొండలో 5వ వార్షికోత్సవ సందర్భంగా ఉరుకందు ఈరన్న స్వామి ఆలయంలో తులసి అర్చన, కనకాభిషేకం, పాలాభిషకం, పల్లకి సేవ, విషేశ పూజలు, అన్నదానం
* గుంటూరు: నేడు మంగళగిరిలో సంజీవని ఉచిత ఆరోగ్య వాహనాన్ని ప్రారంభించనున్న నారా లోకేష్..
* సికింద్రాబాద్: ప్యాట్నీ సిగ్నల్ (మహబూబ్ కాలేజీ సర్కిల్)లో భారత స్వాతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా నిర్వహించే సామూహిక జాతీయ గీతాలాపనలో పాల్గొననున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
* గణేష్ నవరాత్రుల నిర్వహణ, ఏర్పాట్లపై నేడు సమావేశం.. మధ్యాహ్నం 12 గంటలకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ( MCHRD) లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో భేటీ.. ఈ నెల 31 నుండి ప్రారంభం కానున్న గణేష్ నవరాత్రుల నిర్వహణ ఏర్పాట్లపై చర్చ
