Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today 1280 300x169

Whats Today 1280 300x169

* నేడు బీహార్‌ సీఎంగా నితీష్‌ కుమార్‌ ప్రమాణస్వీకారం, రాజ్‌భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు సీఎంగా ప్రమాణం చేయనున్న నితీష్‌

* భారత ఉపరాష్ట్రపతిగా నేటితో ముగియనున్న వెంకయ్యనాయుడు పదవీకాలం, రేపు ఉపరాష్ట్రపతిగా జగదీప్‌ ధన్‌ఖర్‌ ప్రమాణస్వీకారం

* తిరుమల: నేటితో ముగియనున్న శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు, రేపటి నుంచి ఆర్జిత సేవలు పున:రుద్ధరణ

* అల్లూరి సీతారామరాజు జిల్లా : నేడు విలీన మండలాల్లో కేంద్ర బృందం పర్యటన, రంప చోడవరం నియోజకవర్గంలోని చింతూరు, ఎటపాక, కూనవరం మండలాల్లో క్షేత్ర స్థాయిలో పరిశీలించి వరద నష్టాన్ని అంచనా వేయనున్న కేంద్ర బృందం

* అల్లూరి సీతారామరాజు జిల్లా : నేడు జరగాల్సిన ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ముంపు మండలాల పరిధిలో వాయిదా-ఇంటర్మీడియట్ విద్యా శాఖ కమిషనర్

* తూర్పుగోదావరి: ధవళేశ్వరం బ్యారేజ్‌కి భారీగా చేరుతున్న వరద నీరు, 9 లక్షల క్యూసెక్కులు నీరు సముద్రంలోకి విడుదల, 11.40 అడుగులకు చేరిన బ్యారేజ్ నీటి మట్టం

* నెల్లూరు బారా షాహిద్ దర్గాలో రొట్టెల పండుగ, పాల్గొననున్న ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి

* విశాఖ: నేడు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం… 12 అంశాలు అజెండాపై చర్చించనున్న కౌన్సిల్.. భీమిలిలో 50ఎకరాల భూమి బదలాయింపు, ఆస్తి విలువ ఆధారంగా చెత్త పన్ను సేకరణ ప్రతిపాదనలు, భూములు, క్లాప్ చార్జీలను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు

* కర్నూలు: నేటి నుండి మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి 351వ ఆరాధనోత్సవాలు, సాయంత్రం ధ్వజరోహణతో ఉత్సవాలు ప్రారంభం, ఆరాధానోత్సవాలు ప్రారంభించనున్న శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థ స్వామిజీ

* విశాఖ: నేటి నుంచి కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర… ఉత్తర నియోజకవర్గ పరిధిలోని రైల్వే న్యూ కాలనీ నుంచి ప్రారంభం.. పాదయాత్రలో పాల్గోనున్న పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్

* ఏలూరు: నేటి నుండి 13వ తేదీ వరకు ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయంలో పవిత్రోత్సవాలు.. స్వామివారి నిత్యార్జిత కళ్యాణాలు, ఆర్జిత సేవలు రద్దు..

* రేపు తెలంగాణ కేబినెట్‌ సమావేశం

Exit mobile version