Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

* తిరుమల: నేటి నుంచి నడకదారి భక్తులకు ఉచిత దర్శన టోకెన్లు జారీ చేయనున్న టీటీడీ.. అలిపిరి నడకమార్గంలో 10 వేల టికెట్లు.. శ్రీవారి మెట్టు నడకమార్గంలో 5 వేల టికెట్లు జారీ చేయనున్న టీటీడీ

* విజయవాడ : నేడు విద్యాశాఖ మంత్రి బొత్స మీడియా సమావేశం.. పదవ తరగతి పరీక్షలు, ఒంటి పూట బడులు వంటి వాటిపై మాట్లాడనున్న మంత్రి..

* ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 17 రోజుకు చేరుకున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర.. ఉదయం 8గంటలకు బెల్లంపల్లి నియోజకవర్గం మెట్పల్లి గ్రామం నుంచి ప్రారంభం కానున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర.. మెట్పల్లి గ్రామం నుంచి చిత్తాపూర్, ఆవడం, గంగారం మీదుగా కాజిపల్లి నర్సింగాపూర్ గ్రామానికి చేరుకోనున్న పీపుల్స్ మార్చ్.. నెన్నెల మండలం ఆవడం గ్రామంలో లంచ్ బ్రేక్, కాజిపల్లి నర్సింగపూర్ గ్రామంలో నైట్ హాల్ట్

* ప్రకాశం : పెద్దారవీడు మండలం లోని దేవరాజుగట్టులో సచివాలయ కన్వీనర్ల, గృహ సారుదుల సమీక్ష సమావేశంలో పాల్గొననున్న మంత్రి ఆదిమూలపు సురేష్.

* ఒంగోలు 32వ డివిజన్ లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి..

* ఒంగోలు కలెక్టరేట్ వద్ద బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్య కుమార్ పై దాడికి నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా..

* కాకినాడ: తునిలో సచివాలయ కన్వీనర్ల, గృహ సారుదుల సమీక్ష సమావేశంలో పాల్గొననున్న మంత్రి దాడిశెట్టి రాజా

* అంబేద్కర్ కోనసీమ: రామచంద్రపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి వేణు

* అంబేద్కర్ కోనసీమ జిల్లా: నేడు కోనసీమ తిరుమల వాడపల్లిలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం.. మధ్యాహ్నం 2 గంటలకు రథోత్సవం.. రాత్రి 7 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం..

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముత్తుకూరు మండలంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు

* నెల్లూరు: విడవలూరు మండలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి

* విశాఖ: నేడు జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర బీజేపీ ధర్నా.. అమరావతిలో జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వాహనంపై దాడికి నిరసన.

* పశ్చిమగోదావరి జిల్లా: తణుకులో ఆసరా కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. అనంతరం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి హాజరు..

* పశ్చిమ గోదావరి: తాడేపల్లిగూడెంలో ఆసరా కార్యక్రమం తో పాటు పలు కార్యక్రమాలలో పాల్గొనున్న మంత్రి కొట్టు సత్యనారాయణ..

* కాకినాడ: సామర్లకోట రైల్వే స్టేషన్ లో నేటి నుంచి రైల్వే రిజర్వేషన్ వేళలు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసిన డిఆర్ఎం.. ఇప్పటివరకు ఉదయం ఎనిమిది నుంచి రాత్రి 8 వరకు పనిచేసే రిజర్వేషన్ కార్యాలయం.. నేటి నుంచి ఉదయం 8 నుంచి 11:30, సాయంత్రం నాలుగు నుంచి రాత్రి 8 వరకు పనిచేయనున్న రిజర్వేషన్ కౌంటర్

* విశాఖ: స్టీల్ ప్లాంట్ ప్రయివేటీ కరణకు నిరసనగా విశాఖ నగరంలో కార్మిక సంఘాలు చేపట్టిన రిలేదీక్షలకు రెండేళ్లు పూర్తి.. జీవీఎంసీ నుంచి ద్వారకానగర్ ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ తీయనున్న కార్మిక సంఘాలు…

* విశాఖ: నేడు నియోజకవర్గంలో అందుబాటులో ఉండనున్న మంత్రి అమర్నాథ్

* అనంతపురం : కళ్యాణదుర్గం పట్టణంలోని మార్కెట్ యార్డులో జరిగే ఆసరావారోత్సవాలలో కార్యక్రమంలో పాల్గొననున్న ఉషశ్రీ చరణ్

* శ్రీ సత్యసాయి జిల్లా : 57వరోజు యువగళం పాదయాత్ర.. నేడు ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం నారా లోకేష్‌ పాదయాత్ర.. పైదిండి, నామాల క్రాస్, ధర్మవరం ఇందిరమ్మ కాలనీ, ధర్మవరం యర్రగుంట, ధర్మవరం పార్థసారధినగర్, ధర్మవరం ఆర్టీసీ బస్టాండ్‌, ధర్మవరం అంజుమన్ సర్కిల్‌, ధర్మవరం కన్యాకాపరమేశ్వరి గుడి మీదుగా ధర్మవరం సిఎన్ బి గ్రాండ్ వరకు సాగనున్న పాదయాత్ర

* క‌డ‌ప: వైభ‌వంగా ఒంటిమిట్ట కోదండ‌రామస్వామి బ్రహ్మోత్సవాలు.. నేడు రెండో రోజు.. వేణు గానాలంకారంలో కోదండ రాముడు. సాయ‌త్రం ఉంజ‌ల్ సేవ‌, రాత్రికి హంస వాహ‌నంపై సీతారాముల ఊరేగింపు..

* క‌డ‌ప: ఒంటిమిట్ల క‌ళ్యాణం రోజున వచ్చే భ‌క్తుల పంపిణీకి ల‌క్షా 86ల మ‌త్యాల త‌లంబ్రాల ప్యాకెట్ల సిద్ధం చేసిన టీటీడీ అధికారులు..

* క‌డపః నేటి నుంచి వైవీయూలో ఒంటిపూట త‌ర‌గ‌తులు.. ఎండ‌లు పెరిగిన నేప‌థ్యంలో ఉద‌యం 8 నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు త‌ర‌గ‌తులు..

* విజయవాడ : ఎన్టీపీసీ యాష్ పాండ్ ను పరిశీలించనున్న బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు..

* కర్నూలు: నేడు మంత్రాలయంలో పాత ఊరిలో వెలసిన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో నేడు స్వామి వారికి తులసి అర్చన, కనకాభిషేకం, పంచామృతభిషకం వంటి విషేశ పూజలు.. సాయంత్రం స్వామివారిని రథంపై ఉరేగింపు.

* కర్నూలు: నేడు ఆలూరులో గ్రామపంచాయతీ డైలీ మార్కెట్ బహిరంగ వేలం పాట

* శ్రీ సత్యసాయి జిల్లా : రొళ్ల మండలం రత్నగిరిలో రేపటి నుంచి కొల్లాపురి మహాలక్ష్మీ ఉత్సవాలు.

* అనంతపురం : పోలవరం జాతీయ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నిర్మించాలని, కర్ణాటక ప్రభుత్వం కడుతున్న అప్పర్ భద్ర ప్రాజెక్టును ఆపాలంటూ నగరంలోని అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో “రౌండ్ టేబుల్ “సమావేశం.

Exit mobile version