Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

* నేడు ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్.. ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్‌లో తలపడనున్న సబలెంకా (బెలారస్‌), కోకోగాఫ్‌ (అమెరికా)

* నేడు తెలంగాణ ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ ఫలితాలు విడుదల.. ఉదయం 10.40కి వెబ్‌సైట్‌లో ఫలితాలు

* అమరావతి: నేడు ఏపీ ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు.. ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్న అధికారులు

* నేడు కాకినాడలో మెగా యోగా.. మెయిన్ రోడ్డు దగ్గర నుంచి టూ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు 5000 మందితో యోగా.. పాల్గొనున్న జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు

* అనంతపురం : అనంతపురం జిల్లాలో మరో కోవిడ్ కేసు నమోదు.. రెండుకు చేరిన కరోనా కేసులు.

* తిరుమల: ఎల్లుండి నుంచి మూడు రోజులు పాటు శ్రీవారి వార్షిక జేష్ఠాభిషేకం ఉత్సవాలు

* కర్నూలు: ఓర్వకల్లు గ్రీన్‌కో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్‌ను నేడు సందర్శించనున్న తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క..

* నెల్లూరు: అక్రమ మైనింగ్ కేసులో రెండో రోజూ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని విచారించనున్న పోలీసులు.. తొలిరోజు కస్టడికి తీసుకోవడంలో జాప్యం కావడంతో పూర్తి స్థాయిలో విచారించని పోలీసులు..

* కొమురం భీం జిల్లాలో నేడు ఆదివాసీల ర్యాలీ.. టైగర్ కన్జర్వేషన్ కారిడార్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ఇవ్వాళ మహా ర్యాలీ.

* నేడు జగిత్యాల జిల్లాలో పర్యటించనున్న ఎమ్మెల్సీ కవిత.. మధ్యాహ్నం మేడిపల్లి మండలం రంగాపూర్ లో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావును పరామర్శించనున్న కవిత…

* నేడు నల్లగొండ జిల్లా కేంద్రానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఈద్గా లో జరిగే కార్యక్రమానికి హాజరుకానున్న మంత్రి

Exit mobile version