* అమరావతి: నేడు రాజధాని ప్రాంతం అనంతవరంలో వనమహోత్సవం.. హాజరుకానున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, అనంతవరం పార్క్‌లో మొక్కలు నాటనున్న సీఎం, డిప్యూటీ సీఎం
* నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం మూడు గంటలకు సమావేశం.. రైతు భరోసా తేదీ, కార్యాచరణ ప్రకటన.. బనకచర్ల, కాళేశ్వరం పై ఎన్డీఎస్ఏ నివేదిక మీదప్రధాన చర్చ.. ఉద్యోగుల డీఏ, సమస్యలపైనా డిస్కన్ చేసే ఛాన్స్
* అమరావతి: ఏపీ వ్యాప్తంగా బీజేపీ పర్యావరణ దినోత్సవ వేడుకలు.. రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటాలని బీజేపీ శ్రేణులకు ఆదేశాలు.. జిల్లాల వారీగా ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలని దిశానిర్దేశం.. నర్సరీల నుంచీ ఇప్పటికే మొక్కలు రప్పించిన అన్ని జిల్లాల బీజేపీ నాయకులు
* అమరావతి : పదవ తరగతి మూల్యాంకన లోపాలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ… నేడు వైసీపీ స్టూడెంట్స్ వింగ్ ఆధ్వర్యంలో మంగళగిరిలోని పాఠశాల విద్యా కమిషనర్ గారికి వినతిపత్రం సమర్పణ
* తిరుమల: 9వ తేదీ నుంచి శ్రీవారి ఆలయంలో జేష్ఠాభిషేకం ఉత్సవాలు.. మూడు రోజులు పాటు ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ
* తూర్పుగోదావరి జిల్లా: నేడు ఏపీ పేపర్ మిల్లు అంశంపై రాజమహేంద్రి వారసత్వ సంపద పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం.. సీనియర్ న్యాయవాది మద్దూరి శివ సుబ్బారావు గారి అధ్యక్షతన జరుగనున్న సమావేశం
* అనంతపురం : నార్పల మండల కేంద్రంలో వన మహోత్సవం కార్యక్రమం లో పాల్గొననున్న ఎమ్మెల్యే బండారు శ్రావణి..
* అమరావతి: ఏపీ హైకోర్టులో నేడు వల్లభనేని వంశీ మధ్యంతర బెయిల్ పిటిషన్ విచారణ.. వైద్యం చేయించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా సరిగా చేయలేదని మధ్యంతర బెయిల్ ఇవ్వాలని వంశీ పిటిషన్.. నేడు విచారణ జరపనున్న వెకేషన బెంచ్
* అమరావతి: పల్నాడు జంట హత్య కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిన్నెల్లి బ్రదర్స్ పిటిషన్ పై నేడు ఏపీ హైకోర్టు విచారణ.. కావాలని తమను స్థానిక ఎమ్మెల్యే కేసులో ఇరికించారని పిటిషన్
* విజయవాడ: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఏ8 చాణక్య బెయిల్ పిటిషన్ పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ
* కృష్ణా: నేటి నుంచి మచిలీపట్నంలో బీచ్ ఫెస్టివల్.. ఇవాళ్టి నుంచి 4 రోజులపాటు జరగనున్న ఫెస్టివల్
* అనంతపురం : నేటి నుంచి వేరుశనగ విత్తన పంపిణీ. ఆత్మకూరు మండలం పంపనూరులో విత్తన పంపిణీని ప్రారంభించనున్న జిల్లా కలెక్టర్.
* శ్రీ సత్యసాయి : హిందూపురం పట్టణంలోని లక్ష్మీపురం లో ఉన్న శ్రీ బాలాజీ దేవాలయంలో 15వ వార్షికోత్సవం పురస్కరించుకొని స్వామి వారి కల్యాణోత్సవం
* నంద్యాల: నేడు నందికొట్కూరు మం అల్లూరులో నూతన సబ్ స్టేషన్ కు భూమి పూజ చేయనున్న ఎమ్మెల్యే జయసుర్య..
* నేడు మెదక్ జిల్లాలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పర్యటన.. చిన్నశంకరంపేటలోని ఆ ఆలయ వేడుకల్లో పాల్గొననున్న ఎంపీ
* నిజమాబాద్ జిల్లాలో నేడు ఎమ్మెల్సీ కవిత పర్యటన.. నందిపేట మండలం సి.హెచ్ కొండూరు లో లక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొననున్న కవిత.. జిల్లాలో మూడు రోజుల పాటు బస చేయనున్న జాగృతి అధ్యక్షురాలు.
* హైదరాబాద్: రేపు లాసెట్, పీజీలాసెట్ పరీక్షలు.. ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 12:30 నుంచి 2 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5:30 గంటల వరకు మూడు సెషన్లలో పరీక్షలు.. 76 పరీక్ష కేంద్రాల ఏర్పాటు.. హాజరుకానున్న 57,715 మంది అభ్యర్థులు..
* తిరుమల: 25 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 78,288 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 32,079 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.67 కోట్లు
* గుంటూరు: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నేడు గుంటూరులో పర్యావరణంపై అవగాహన ర్యాలీ, మొక్కలు నాటనున్న ఎమ్మెల్యేలు మాధవి, నసీర్ అహ్మద్.
