NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

* అమరావతి: నేడు ఏపీ సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్‌ సీఈవో సమావేశం.. మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో సీఎంతో నీతి ఆయోగ్‌ సీఈవో భేటీ.. రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరు, ఇతర అంశాలపై చర్చ.

* కడప : రెండవ రోజు పులివెందులలో పర్యటించనున్న మాజీ సీఎం వైఎస్ జగన్.. నేడు పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్న జగన్…

* హైదరాబాద: నేడు గాంధీభవన్‌లో పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ అధ్యక్షతన కులగణనపై సమావేశం, హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి, దీపాదాస్‌ మున్షీ.. మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు.

* హైదరాబాద్‌: ఇవాళ సాయంత్రం జార్ఖండ్ కి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.

* తిరుమల: రేపు శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం.. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ.. ఇవాళ సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసిన టీటీడీ..

* అనంతపురం: నేడు తాడిపత్రి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం లో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం.

* అనంతపురం : పుట్లూరు మండలం 132కేవీ కోమటికుంట్ల సబ్ స్టేషన్ లో మరమ్మత్తుల కారణం గా పుట్లూరు,యల్లనూరు మండలాల పరిధిలో ఉన్న గ్రామాలకు ఉదయం 7 గంటల నుండి 12 గంటల వరకు విద్యుత్ అంతరాయం.

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర పురపాలక శాఖ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ.. విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారు.

* నెల్లూరు: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అనం రామనారాయణ రెడ్డి.. ఒంగోలు.. కావలిలలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు

Show comments