Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

What's Today Ntv

What's Today Ntv

* ఇవాళ బీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4జీ టెక్నాలజీని ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ.. వర్చువల్ సమావేశానికి సీఎం చంద్రబాబుకు బీజేపీ ఆహ్వానం.. టెలికాం రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శ్రీకారం.. ప్రధాని మోడీ వర్చువల్ గామాట్లాడే విధంగా విజయవాడ లో ఉదయం 9.30 కు ఏర్పాటు

* అమరావతి: ఇవాళ ఎనిమిదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. క్వశ్చన్ అవర్ తో ప్రారంభంకానున్న చివరి రోజు అసెంబ్లీ సమావేశాలు..

* అమరావతి : ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్న ఎనిమిదవ, చివరి రోజు శాసనమండలి సమావేశాలు…

* నిజామాబాద్ : నేడు జిల్లాలో ఐదు ఏటిసీ కేంద్రాల ప్రారంభం. వర్చువల్ గా ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి.. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ప్రారంభోత్సవంలో పాల్గొననున్న ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ.. జిల్లా కేంద్రంతో పాటు బోధన్, కమ్మర్ పల్లి, భీమ్గల్ లో ఏ. టి. సి. కేంద్రాలు.

* హైదరాబాద్‌: నేడు ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించి రాజకీయ పార్టీల నేతల సమక్షంలో మహిళా రిజర్వేషన్లు ఖరారు చేయనున్న కలెక్టర్లు.. ఇవాళ మహిళా రిజర్వేషన్ల కోసం డ్రా తీయనున్న కలెక్టర్లు.. ఆయా జిల్లాల్లో ఉన్న స్థానిక సంస్థల స్థానాల ఆధారంగా 50 సీట్లు మహిళకు కేటాయింపు

* హైదరాబాద్‌: నిండుకుండలా జంట జలాశయాలు.. భారీ వర్షాలతో పోటెత్తిన వరద.. వరద ఉధృతితో ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ గేట్లు తెరిచి దిగువకు నీటి విడుదల.. ఉధృతంగా ప్రవహిస్తోన్న మూసీ నది.. చాదర్ ఘాట్ లోయర్‌ బ్రిడ్జి మూసివేత

* పల్నాడు జిల్లా: వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్యల కేసులో నేడు పోలీసుల విచారణకు హాజరుకానున్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సోదరుడు వెంకట్రామిరెడ్డి.

* అనంతపురం : అనంతపురం నగరంలో నేటి నుంచి రెండు రోజులు పాటు సిఐటియు జిల్లా మహాసభలు.

* అనంతపురం : తాడిపత్రి లో దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా ఆరవ రోజు భక్తులకు ప్రత్యేక అలంకారం తో దర్శనమివ్వనున్న దుర్గా దేవి అమ్మవారు.

* నెల్లూరు: జొన్నవాడలో 6వ రోజుకు చేరిన దేవీ శరన్నవరాత్రులు.. భండాసురవధ అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న జొన్నవాడ కామాక్షితాయి అమ్మవారు

* చిత్తూరు: నేడు పుంగనూరులో సజ్జల పర్యటన.. సదుం(మం)యర్రాతివారిపల్లిలో పుంగనూరు నియోజకవర్గ వైసిపి విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొననున్న పెద్దిరెడ్డి, సజ్జల రామకృష్ణ రెడ్డి..

* తూర్పుగోదావరి జిల్లా: ఆంధ్ర మైసూర్ గా పేరుగాంచిన రాజమండ్రి దేవిచౌక్ లో 6వ రోజు వైభవంగా బాలత్రిపుర సుందరీ దేవి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు.. శ్రీ శ్యామలదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు

* విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఆరో రోజుకి చేరుకున్న దసరా నవరాత్రి మహోత్సవాలు… శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మ… దుర్గమును దర్శించేందుకు బారులు తీరిన భక్తులు

* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ని రిమాండ్ లో ఉన్న ఎంపీ మిధున్ రెడ్డితో ములాఖాత్ కానున్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు

* అనకాపల్లి జిల్లా: మిట్టల్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు నేడు ప్రజాభిప్రాయ సేకరణ… నక్కపల్లి (మం) చందనాడలో పర్యావరణ, కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పబ్లిక్ హియరింగ్ .. అవాంచనీయ సంఘటనలు జరక్కుండా 400మంది పోలీసులతో భద్రత..

* కర్నూలు: నేడు కోడుమూరులో శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్న శ్రీ వల్లెలాంబదేవి

* నంద్యాల: మహానంది క్షేత్రంలో 6వ రోజు శ్రీ కామేశ్వరీ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు… ఆలయంలోని కామేశ్వరీ అమ్మవారి మూలమూర్తికి శ్రీ మహాలక్ష్మి అలంకరణ… అలంకార మండపం లోని ఉత్సవ మూర్తికి కాత్యాయని అలంకరణ.. అశ్వ వాహనంపై కాత్యాయని అలంకరణలో కామేశ్వరి దేవి అమ్మ వారికి గ్రామోత్సవం

* తిరుమల: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో నాలుగోవ రోజు.. ఉదయం కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి.. రాత్రి సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీవారు

* తిరుమల: 29 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 75,358 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 29,166 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.2.58 కోట్లు

* శ్రీ సత్యసాయి: హిందూపురం ఎంజీఎం పాఠశాల ఆవరణలో ఆంధ్రప్రదేశ్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి కుస్తీ పోటీలు

* శ్రీ సత్యసాయి: లేపాక్షిలో నేడు దుర్గా, పాపనాశేశ్వర, వీరభద్రస్వామి ఆలయంలో శ్రీ లలితా దేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీ దుర్గాదేవి

* కర్నూలు: హోళగుంద మండలం దేవరగట్టులో నేటి నుడి 6వ తేదీ వరకు శ్రీ మాల మల్లేశ్వర స్వామి ఉత్సవాలు…..

* అలంపూర్ లోని శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలలో దేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా… అరవ రోజు కాత్యాయని దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న జోగులాంబ అమ్మవారు..

* భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి దేవస్థానం నందు జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఐదవ రోజు అయిన నేడు దాన్యలక్ష్మి అలంకారం లో భక్తులకు దర్శనం ఇవ్వనున్న అమ్మవారు

* నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. బోనకల్లు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న డిప్యూటీ సీఎం భట్టి..

* వరంగల్: శ్రీ భద్రకాళీదేవీ శరన్నవరాత్రి (దసరా) మహోత్సవాలలో భాగంగా నేడు 6వ,రోజు ఉదయం 4గం” నిత్యాహ్నికం, భువనేశ్వరి అలంకారము, చతు:స్థానార్చన. స్కందమాత దుర్ఘర్చన.., ఉదయం 11గం”గందోత్సవం.. సాయంత్రం 7 గం” దూమ్రహాదుర్గార్చనా, సాలంభజిక సేవ లో భక్తులకు దర్శనం ఇవ్వనున్న భద్రకాళి అమ్మవారు..

* భద్రాద్రి భద్రాచలం మొత్తం గోదావరి నీటిమట్టం 46.6 అడుగులు కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక

* భద్రాద్రి జిల్లాలో వర్షాలు నేపథ్యంలో ఓపెన్ కాస్ట్ గనుల్లోకి చేరిన నీరు మణుగూరు, ఎల్లందు, సత్తుపల్లిలో ఓపెన్ కాస్ట్ లో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి

* ఆదిలాబాద్: నేడు జిల్లా లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పర్యటన. భీం పూర్ మండలం పిప్పల్ కోటి రిజర్వాయర్ భూ నిర్వాసితుల తో సమావేశం కానున్న సీపీఎం నేతలు.

* నిర్మల్: బాసరలో 6 వ రోజుకు చేరిన నవరాత్రి ఉత్సవాలు.. నేడు కాత్యాయని అలంకారం లో అమ్మవారి దర్శనం.. రవ్వకేసరి నివేదన.

Exit mobile version