Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

What's Today Ntv

What's Today Ntv

* నేడు వినాయక చవితి.. దేశవ్యాప్తంగా గ్రామాలు, వీధులు, పట్టణాలు, ఇళ్లలో కొలువుదీరనున్న గణనాథులు..

* భారత్‌పై సుంకాలు 50 శాతానికి పెంచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్.. నేటి నుంచే అమల్లోకి రానున్న 50 శాతం సుంకాలు..

* ఢిల్లీ: ఇవాళ సీపీఐ, సీపీఎం అగ్రనేతలను కలవనున్న ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్‌ రెడ్డి.. మధ్యాహ్నం 2 గంటలకు సీపీఐ జాతీయ పార్టీ కార్యాలయానికి, 3 గంటలకు సీపీఎం కార్యాలయాలనికి వెళ్లనున్న సుదర్శన్ రెడ్డి.. ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి కి వామపక్ష పార్టీల మద్దతు కోసం పార్టీ నాయకులతో సమావేశం..

* హైదరాబాద్: నేడు తెలంగాణ స్పోర్ట్స్‌హబ్ బోర్డు మీటింగ్.. ఉదయం 11 గంటలకు లీలా హోటల్‌లో సమావేశం.. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం..

* తిరుమల: 12 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 77,837 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 21,510 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.49 కోట్లు

* ఇవాళ విజయవాడకు మాజీ సీఎం వైఎస్ జగన్.. రాణిగారితోటలో వినాయకచవితి వేడుకలకు హాజరుకానున్న జగన్.. వినాయకచవితి పండుగ సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్న జగన్..

* అమరావతి: ఇవాళ ఉదయం 9 గంటలకు తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో వినాయకచవితి వేడుకలు.. హాజరుకానున్న పలువురు పార్టీ ముఖ్య నేతలు..

* కాకినాడ పరివాహక ప్రాంతం నుంచి ఏలేరు ప్రాజెక్టు కి 1400 క్యూసెక్కుల వరద నీరు.. రిజర్వాయర్ పూర్తిస్థాయి సామర్థ్యం 24.11 టిఎంసిలు, ప్రస్తుతం 13. 47 టీఎంసీలు నిల్వలు.. సాగుకి 1500 క్యూసెక్కులు దిగువకు విడుదల

* తిరుపతి: నేడు పద్మావతి అమ్మవారి దర్శించుకోనున్న ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్…

* తూర్పుగోదావరి జిల్లా అనపర్తి.. బిక్కవోలు ప్రసిద్ధ లక్ష్మీ గణపతి ఆలయంలో మొదలైన చవితి వేడుకలు.. తెల్లవారుజామున తీర్థపు బిందె సేవతో మొదలైన ఉత్సవాలు.. నేటి నుండి 9 రోజులపాటు జరగనున్న ఉత్సవాలు.. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించిన అర్చకులు.. ఉదయం 11 గంటలకు కలశ స్థాపన చేయనున్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులు

* ఉమ్మడి విశాఖ జిల్లాలో కొలువుదీరిన భారీ గణనాథులు… గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానమే లక్ష్యంగా అనకాపల్లిలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న భారీ లంబోదరుడు…

కడప : వాడ వాడలా ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు… భారీ కటౌట్లతో రంగరంగుల విద్యుత్ దీపాలతో వినాయక మండపాలు అలంకరణ… వినాయక చవితి ఉత్సవాలకు వర్షం ఆటంకం… రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం..

* కడప : సెప్టెంబర్ ఒకటో తేదీన రాజంపేటలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు నాయుడు… సామాజిక పెన్షన్లు పంపిణీ చేయనున్న సీఎం… అనంతరం కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్న సీఎం…

* పల్నాడు జిల్లా పులిచింతల ప్రాజెక్టుకు‌ కొనసాగుతున్న వరదప్రవాహం. మూడు గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల. ఇన్ ఫ్లో… లక్షా 40వేల 126 క్యూసెక్కులు.. ఔట్‌ ఫ్లో లక్షా 16వేల 273 క్యూసెక్కులు. ప్రస్తుత నీటినిల్వ… 40.53 టీఎంసీలు

Exit mobile version