Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

What's Today Ntv

What's Today Ntv

* రెండో రోజు గుజరాత్‌లో ప్రధాని మోడీ పర్యటన.. పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొనున్న మోడీ

* ఢిల్లీ: న ఏడు హైలెవల్‌ మీటింగ్‌.. టారిఫ్స్‌పై చర్చ.. రేపటి నుంచి అమలులోకి రానున్న ట్రంప్‌ సెకండరీ టారిఫ్స్

* విజయవాడ: ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో నేడు 12 మంది నిందితులను ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్న సిట్‌ అధికారులు

* నేడు బీహార్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, వాకిటి శ్రీహరి.. బీహార్‌లో రాహుల్ గాంధీ చేస్తున్న ఓటర్ అధికార యాత్రకు మద్దతు తెలుపనున్న సీఎం, మంత్రులు..

* అమరావతి : తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పలువురు కీలక వైసీపీ నేతలతో సమావేశం కానున్న వైఎస్ జగన్.. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం..

* బాపట్ల : కొరిశపాడు మండలం పమిడిపాడులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ, పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, కొలుసు పార్ధసారధి, ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు..

* తూర్పుగోదావరి జిల్లాలో నేడు రాష్ట్ర గృహ నిర్మాణం, సమాచార & పౌర సంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్ధసారధి పర్యటన.. రాజనగరం మండలంలో టీడీపీ పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశంలో పాల్గొంటారు.

* తిరుమల: 10 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 67,767 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 25,852 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ. 4.07 కోట్లు

* నేడు కాకినాడలో పలు పార్టీ కార్యక్రమాలలో పాల్గొనున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్..

* అనంతపురం : నేడు టిడిపి అనంతపురం పార్లమెంటరీ పార్టీ సమావేశం. హాజరుకానున్న మంత్రులు, ఎమ్మెల్యేలు.. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి హాజరు పై సందిగ్ధత. నిన్న డీఆర్సీ మీటింగ్ కూడా హాజరుకాని దగ్గుబాటి ప్రసాద్.

* శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు.. 7 గేట్లు 10 అడుగులు మేర ఎత్తి నీరు విడుదల.. ఇన్ ఫ్లో 2,60,615 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 2,50,230 క్యూసెక్కులు.. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

* విశాఖలో నేడు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పర్యటన… హిమగిరి, ఉదయ్ గిరి నౌకలు జాతికి అంకితం చేయనున్న రక్షణ శాఖ మంత్రి

* సంగారెడ్డి: నేడు ఆందోల్ నియోజకవర్గంలో మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటన.. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి

Exit mobile version