Site icon NTV Telugu

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

* నేడు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. రాష్ట్రంలోని 288 అసెంబ్లీ స్థానాలకు నేడు ఒకే విడతలో పోలింగ్‌.. నవంబర్ 23 ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన..

* నేడు జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలు.. మలి విడతలో 38 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్‌.. జార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు.. నవంబర్ 13 న 43 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగగా.. నేడు మలి విడతలో 38 స్థానాలకు పోలింగ్‌

* నేడు మరో నాలుగు రాష్ట్రాల్లోని 15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు .. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, కేరళలో మొత్తం 15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు.

* ఇవాళ వేములవాడలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన. వేములవాడ రాజన్నను దర్శించుకుని ప్రత్యేకపూజలు చేయనున్న సీఎం. వేములవాడలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం. అనంతరం వేములవాడలో బహిరంగసభలో పాల్గొననున్న ముఖ్యమంత్రి.

* ప్రకాశం : ఒంగోలు మల్లయ్య లింగం భవన్ లో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మహాసభలు, హాజరుకానున్న పలువురు రాష్ట్రస్థాయి విద్యార్థి సంఘ నేతలు..

* ప్రకాశం: పొదిలిలో సమస్యలు పరిష్కరించాలంటూ మున్సిపల్ పారిశుధ్య కార్మికుల ధర్నా..

* తూర్పు గోదావరి జిల్లా: నేడు జాతీయ విపత్తు సహాయ దళం (NDRF) జాతీయ బెటాలియన్‌తో కలిసి రైలు ప్రమాదంపై జాయింట్ సాంకేతిక వ్యాయామం ( మాక్ డ్రిల్).. రాజమండ్రి రైల్వే స్టేషన్‌ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్..

* అమరావతి: ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం.. సెక్రటేరియట్ 1వ బ్లాక్ లో సమావేశం కానున్న ఏపీ కేబినెట్.. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రొమోషన్ బోర్డులోని అంశాలు ఆమోదించనున్న ఏపీ కేబినెట్.. ఈనామ్ భూముల అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం.. పలు ఆర్ధిక అంశాల పై కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశం

* అమరావతి: ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభంకానున్న ఏపీ అసెంబ్లీ.. మాజీ శాసనసభ్యుడు నారా రామ్మూర్తి నాయుడు మరణానికి సంతాపం తెలపనున్న సభ.. 150 రోజుల్లో ఊహకందని అభివృద్ధి, సంక్షేమంపై చర్చ

* అమరావతి: ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభంకానున్న శాసన మండలి..

* తిరుమల: 1 కంపార్టుమెంట్‌లో వేచివున్న భక్తులు.. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 62,248 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 18,852 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.71 కోట్లు

* హైదరాబాద్‌: తెలంగాణలో నేటితో ముగియనున్న టెట్‌ దరఖాస్తు గడువు..

Exit mobile version