* అలస్కాలో ముగిసిన డొనాల్డ్ ట్రంప్ – పుతిన్ భేటీ.. సుమారు 3 గంటలపాటు కొనసాగిన సమావేశం.. ఎలాంటి ఒప్పందం కుదరకుండానే ముగిసిన చర్చలు.. సమావేశంలో చర్చల సరళిపై ట్రంప్, పుతిన్ విభిన్న వాదనలు.. సమావేశం ఫలప్రదమైందన్న పుతిన్, ఎలాంటి ఒప్పందం కుదురలేదన్న ట్రంప్..
* తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ.. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే ఛాన్స్.. భారీ ఉరుములతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం.. ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వర్షం
* నేడు జార్ఖండ్‌కి సీఎం రేవంత్ రెడ్డి.. ఉదయం 11 గంటలకు జార్ఖండ్ కి రేవంత్ రెడి.. మాజీ సీఎం శిబు సోరెన్ కుటుంబాన్ని పరామర్శించనున్న రేవంత్..
* హైదరాబాద్: నేడు ఉదయం 11 గంటలకు నార్సింగ్ లోని హరే కృష్ణ హెరిటేజ్ టవర్స్ (నియర్ కోకాపేట్) లో హరే కృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో జరిగే శ్రీకృష్ణ జన్మాష్టమి సెలబ్రేషన్స్ లో పాల్గొననున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
* తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి గోగర్భం డ్యామ్ వరకు క్యూ లైన్ లో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 77,043 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 41,859 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.53 కోట్లు
* నెల్లూరు: సిటీ నియోజకవర్గంలో మంత్రి నారాయణ పర్యటన.. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు పరిశీలన,
* శ్రీ సత్యసాయి : నేడు కృష్ణాష్టమి పురస్కరించుకొని హిందూపురం పట్టణంలో బెంగళూరు ఇస్కాన్ ఆధ్వర్యంలో వేడుకలు.
* సిద్దిపేట: నేడు గజ్వేల్ లో యూరియా కొరత తీర్చాలంటూ BRS పార్టీ ఆధ్వర్యంలో ధర్నా.. పాల్గొననున్న సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు
* రేపు ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఖరారు.. ఈ నెల 17 ఢిల్లీలో సమావేశంకానున్న బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు
