NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

* నేడు శబరిమలలో మకరజ్యోతి దర్శనం.. భారీగా తరలివస్తున్న అయ్యప్ప భక్తులు..

* మహాకుంభ్ 2025 మొదటి అమృత్ స్నాన్ ఉదయం 6:15 గంటలకు ప్రారంభం.. మహానిర్వాణి అఖారాలోని ముందుగా ఋషులు మరియు సాధువుల అమృత స్నానం

* ఈరోజు గంగాసాగర్‌లో లక్షలాది మంది యాత్రికులు పవిత్ర స్నానాలు.. రంగంలోకి నేవీ, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు

* తిరుపతి: నారావారిపల్లెలో రెండో రోజు సీఎం చంద్రబాబు పర్యటన.. కులదైవం నాగాలమ్మను దర్శించుకోనున్న నారా కుటుంబం. సీఎం తల్లిదండ్రులు నారా ఖర్జూర నాయుడు, అమ్మణ్ణమ్మ సమాధులకు పూజలు.. సాయంత్రం 5గంటలకు విజయవాడకు తిరుగు ప్రయాణం

* ప్రకాశం : మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి టంగుటూరు మండలం తూర్పు నాయుదుపాలెం లోని క్యాంప్ కార్యాలయంలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటారు..

* బాపట్ల : మంత్రి గొట్టిపాటి రవికుమార్ చిలకలూరిపేట లోని ఆయన నివాసంలో ఉంటారు..

* బాపట్ల: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి కారంచేడులో సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటారు..

* అంబేద్కర్ కోనసీమ జిల్లా: నేడు కొత్తపేటలో సంక్రాంతి సందర్భంగా ప్రభల ఉత్సవం.. పాత , కొత్త రామాలయాల ప్రభల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు.. ప్రత్యేక ఆకర్షణగా సాయంత్రం అర్ధరాత్రి బాణాసంచా ప్రదర్శన.. ఉభయ రాష్ట్ర ల నుండిభారీగా తరలి రానున్న జనం

* గుంటూరు: పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు కార్యాలయంపై దాడి చేసిన ఘటనపై ,నేడు జిల్లా ఎస్పీని కలవనున్న వైసీపీ నేతలు.. కార్యాలయంపై దాడి చేసి పలువురునీ గాయపరిచిన ఘటనపై ఫిర్యాదు చేయనున్న వైపీసీ

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ నెల్లూరులో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు

* విశాఖ: నేడు ఆర్కే బీచ్ లో కైట్ ఫెస్ట్, సంక్రాంతి రోజున రంగు రంగుల పతంగులతో జరగనున్న పోటీలు

* తిరుమల: 19వ తేదీ వరకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం.. తిరుపతిలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ.. ఎల్లుండికి సంబంధించిన దర్శన టిక్కెట్లు జారీ చేస్తున్న టిటిడి

* తిరుమల: నిన్న శ్రీవారిని దర్శించుకున్న 74,800 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 17,726 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.48 కోట్లు

* పల్నాడు: నేడు పలనాడు ఎస్పీని కలవనున్న మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న.. తనపై జరిగిన దాడి కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేరును చేర్చాలని, జిల్లా ఎస్పీని కోరనున్న బుద్ధ వెంకన్న…

Show comments